అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది.. అలా ఎలా జరిగింది.. ఇది దేవుడి మహిమ కాకపోతే ఇంకేంటి మరీ.. ఇదే ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం.. అమెరికా దేశం కాలిఫోర్నియాలో కార్చిచ్చు..
భీకర మంటలు వేలాది ఇళ్లను కాల్చి బూడిద చేశాయి. 2025, జనవరి 15వ తేదీ వరకు 15 వేల ఇళ్లు బూడిదగా మారాయి.. ఈ 15 వేల ఇళ్లల్లో ఒకే ఒక్క ఇల్లు మాత్రం చెక్కుబెదరలేదు.. మంటలకు ముందు ఎలా ఉందో.. మంటల తర్వాత కూడా అలాగే ఉంది.. ఇది ఎలా సాధ్యం అయ్యింది అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అది కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఫ్లోర్స్ డా అనే ప్రాంతం. పెద్ద గేటేడ్ కమ్మూనిటీ అది. కార్చిచ్చుకు ఈ కాలనీ మొత్తం సర్వనాశనం అయ్యింది. ఒకే ఒక్క ఇల్లు మాత్రం చెక్కుచెదరలేదు. ఈ విషయాన్ని ఆ ఇంటి యజమాని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.
కాలిఫోర్నియాలోని మంటలకు లాస్ ఫ్లోర్స్ డా కాలనీలోని అన్ని ఇళ్లు కాలిపోయాయి. అతని ఇంటికి ముందు, వెనక, పక్కన ఉన్న ఇళ్లు మంటలకు బూడిద అయ్యాయి. అంతెందుకు ఈ కాలనీ మొత్తం స్మశానంగా మారింది. వీధిలోని ఏ ఒక్క ఇంటిని మంటలు వదల్లేదు. అలాంటి ఆ ఇంటికి మాత్రం ఏమీ కాలేదు. ఆ ఇల్లు నిర్మాణం కూడా చెక్కలతో చేసిందే.. ఇంకా పని జరుగుతుంది. ఇంట్లో పెయింట్ డబ్బాలు ఉన్నాయి.. పెద్ద ఎత్తున చెక్క ఉంది. అయినా ఆ ఇంటిని మంటలు ఏమీ చేయలేదు. దీనిపై ఆ ఇంటి యజమాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవుడి మహిమ అంటున్నాడు.. ఆయన అనటం కాదు.. వీడియో చూసిన తర్వాత ప్రపంచం మొత్తం అంటోంది.
కాలనీ మొత్తాన్ని మంటలు మాయం చేస్తే.. ఆ ఇల్లు అంత నిక్షేపంగా ఎలా ఉంది.. ఇది దేవుడి లీల.. దేవుడి దయ.. దేవుడి మహిమ అంటూ నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీరు అలాగే అనొచ్చు.. ఎందుకంటే అంత ఆశ్చర్యంగా.. అవాక్కయేలా ఉంది ఈ ఘటన. కాలనీ మొత్తాన్ని.. ఆ ఇంటి చుట్టూ ఉన్న అన్ని ఇళ్లను నాశనం చేసిన మంటలు.. ఆ ఇంటిని ఎందుకు వదిలేశాయ్.. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది.