సార్.. నా పోస్టుమార్టం ఆపండి.. పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు.

త్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా, ఘాతమ్‌పూర్ టౌన్‌లో గురువారం ఓ శవం దొరికింది. ఆ శవం ఎవరిది అన్నది తెలియలేదు. దీంతో పోలీసులు శవం ఫొటో తీసి, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు.


ఆ శవం ఎవరిదో తెలిస్తే.. చెప్పమని కోరారు. సాయంత్రం సుమన్ అనే మహిళ ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. చనిపోయిన వ్యక్తి తన తమ్ముడు అజయ్ అని గుర్తుపట్టింది. అతడు తరచుగా రెడ్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకుంటాడని కూడా పోలీసులకు చెప్పింది.

శవం ఎవరిదో తెలిసింది కాబట్టి.. పోలీసులు మిగిలిన ప్రొసిజర్స్ పూర్తి చేశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ‘సార్ నా పేరు అజయ్ శంక్‌వర్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి’ అని అన్నాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావటంతో నోరెళ్ల బెట్టారు. అతడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

అతడే నిజమైన అజయ్ అని నిర్ధారించుకున్నాక తర్వాత పోస్టుమార్టం నిలిపేశారు. దీనిపై ఏసీపీ కృష్ణకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఘాతమ్‌పూర్ మెయిన్ క్రాస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి శవం దొరికింది. అజయ్ కుటుంబం ఆ శవం అజయ్‌దే అని గుర్తుపట్టింది. దీంతో పోస్టుమార్టం కోసం పంపాము. తర్వాత నిజమైన అజయ్ స్టేషన్‌కు వచ్చాడు. దీంతో పోస్టుమార్టం ఆపేశాము. శవం ఎవరిదో కనుక్కునే పనిలో పడ్డాము’ అని అన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.