అందం లో మహేష్ బాబు తో పోటీపడే హీరో తెలుగులో ఒకరున్నారు…కానీ సక్సెస్ లు మాత్రం లేవు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదటి సినిమాతోనే నటుడిగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.


ఇక మురారి(Muraari), ఒక్కడు(Okkadu) లాంటి సినిమాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన పోకిరి (Pokiri) సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసినప్పటికి ఆయనకంటూ ఒక సపరేటు క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. రాజమౌళి(Rajamouli)తో చేస్తున్న సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఏ సినిమా కోసం పెద్దగా కష్టపడింది అయితే లేదు. చాలా సింపుల్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలాంటిది రాజమౌళి సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడాల్సిన అవసరం అయితే వచ్చిందనే చెప్పాలి… ఇక ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం కెన్యా కి వెళ్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మహేష్ బాబు లాంటి అందమైన నటుడు మరొకరు లేరు అంటూ చాలామంది అతన్ని పొగుడుతూ ఉంటారు. నిజానికి మహేష్ బాబు అందగాడే అయినప్పటికి కొన్ని యాంగిల్స్ లో చూస్తుంటే ఆయనది కూడా పెద్దగా ఇంప్రెస్ చేసే ఫేస్ అయితే కాదని అనిపిస్తూ ఉంటుంది.

ఇక నిజానికి ఆయన కంటే వైట్ గా చాలా అందంగా ఉన్న తెలుగు హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు అంటే అక్కినేని అఖిల్ అనే చెప్పాలి. అఖిల్ చూడడానికి ఫెయిర్ గా ఉంటాడు. లుక్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాడు. ఇకపై స్కిన్ టోన్ పరంగా చూసుకున్న మహేష్ బాబు రేంజ్ లోనే ఉంటాడు. ఒకానొక సందర్భంలో జూనియర్ మహేష్ బాబు అని కూడా అఖిల్ ని పిలిచారు.

అంటే ఆయన మహేష్ బాబుతో అన్ని విధాలుగా మ్యాచ్ అయ్యాడనే చెప్పాలి. కానీ అలాంటి అఖిల్ కి ఇప్పటివరకు చెప్పుకోడానికి ఒక సక్సెస్ కూడా లేదనే చెప్పాలి. ఇండస్ట్రీ కి వచ్చి పది సంవత్సరాలు దాటినప్పటికి ఒక్క సక్సెస్ కూడా లేకపోవడం అనేది నిజంగా బాధకరమైన విషయమనే చెప్పాలి…

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.