ఈ యాప్‌లు మీ ఫోన్‌ కాల్స్‌ రికార్డు చేస్తున్నాయ్‌… వాట్సాప్‌ చాట్‌ను సేకరిస్తున్నాయ్‌… వెంటనే తొలగించండి.!

www.mannamweb.com


ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వివిధ అవసరాల కోసం అనేక (Android Apps) యాప్‌లను వినియోగిస్తుంటాం. అయితే అందులో కొన్ని యాప్‌లు యూజర్ల వ్యక్తిగత సమాచారం సహా సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి.
తాజాగా అటువంటి 12 ఆండ్రాయిడ్‌ యాప్‌లను ESET కు చెందిన భద్రతా నిపుణులు కనుగొన్నారు.

ఈ 12 ఆండ్రాయిడ్ యాప్‌లు మెసేజింగ్‌, న్యూస్‌, హోరోస్కోప్‌ సహా ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఉంటూ యూజర్లకు తెలియకుండానే వారి సమాచారాన్ని సేకరిస్తాయి. vajraspy అనే రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌ ద్వారా పోన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో పనిచేస్తూ సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తున్నాయి.

ఈ తరహా ఆండ్రాయిడ్‌ యాప్‌లు స్మార్ట్‌ఫోన్లలోని కాంటాక్ట్‌లు, కాల్‌ లాగ్‌, ఫైల్‌, మెసేజ్‌లు వంటి సమాచారాన్ని దొంగిస్తున్నాయి. వీటిలో కొన్ని యాప్‌లు మరింత ప్రమాదకరమని తెలుస్తున్నాయి. ఈ యాప్‌లు ఏకంగా వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి సందేశాలను కూడా సేకరించగలవని సమాచారం. మరియు ఫోన్‌ కాల్స్‌ను రికార్డు చేయడం, ఫోన్‌ కెమెరాలతో యూజర్‌ అనుమతి లేకుండా ఫొటోలు కూడా తీయగలవు.

ఈ యాప్‌లు కొన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌లోనూ అందుబాటులో ఉండేవి, మిగిలినవి థర్డ్‌పార్టీ యాప్‌లుగా ఉన్నాయి. అయితే గూగుల్‌ ఇప్పటికే ఈ యాప్‌లను తీసివేసింది. ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు వెంటనే ఆయా యాప్‌లను తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి తీసివేయాల్సి ఉంటుంది. అయితే ఈ డేటాను యాదృచ్చికంగా సేకరించినట్లు తెలుస్తోంది.

**ఈ కింది యాప్‌లను వెంటనే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి తొలగించాల్సి ఉంటుంది.

హలో చాట్‌
చిట్‌ చాట్‌
మీట్‌ మి
నిడుస్‌ (Nidus)
రఫాకత్‌ న్యూస్‌ (Rafaqat news)
Tak Talk
వేవ్‌ చాట్‌
ప్రైవ్‌ టాక్‌
గ్లో గ్లో (Glow Glow)
లెట్స్‌ చాట్‌
NioNio
క్విక్‌ చాట్‌
యోహో టాక్‌ (Yoho Talk)
**థర్డ్‌ పార్టీ యాప్‌లు

Essential Horoscope for Android
3D skin Editor for PE Minecraft
లోకో మేకర్‌ ప్రో
ఆటో క్లిక్‌ రిపీటర్‌
కౌంట్‌ ఈజీ క్యాలరీ కాలిక్యులేటర్‌
సౌండ్‌ వాల్యూమ్‌ ఎక్స్‌టెండర్‌
లెటర్‌ లింక్‌
న్యూమరాలజీ పర్సనల్‌ హోరోస్కోప్‌ న్యూమరిక్‌ ప్రిడిక్షన్‌
స్టెప్‌ కీపర్‌ : ఈజీ పీడోమీటర్‌
ట్రాక్‌ యువర్‌ స్లీప్‌
సౌండ్ వాల్యూమ్‌ బూస్టర్‌
ఆస్ట్రోలజీకల్‌ నేవిగేటర్‌ : డైలీ హోరోస్కోప్‌ అండ్‌ టారో
యూనివర్సల్‌ కాలిక్యూలెటర్‌
పైన చెప్పిన యాప్‌లను మీ స్మార్ట్‌ఫోన్లలో ఉంటే తక్షణమే తొలగించడం ఉత్తమం. న్యూస్‌, మెసేజ్‌ సహా ఇతర పేర్లతో ఉన్న యాప్‌లు అనేక వివరాలను స్మార్ట్‌ఫోన్ల నుంచి దొంగలిస్తున్నాయి. ఫోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ వారికి అవసరమైన సమాచారం మొత్తాన్ని దొంగలిస్తున్నాయి. గూగుల్‌ ఇప్పటికే ప్లేస్టోర్‌ నుంచి యాప్‌లను తొలగించింది.

* ఆండ్రాయిడ్‌ ఫోన్ల భద్రత కోసం గూగుల్‌ కొత్త సెక్యురిటీ ఫీచర్‌ను పరిచయం చేస్తుంది. హానికరమైన లింక్‌ల నుంచి యూజర్లకు ఈ ఫీచర్‌ భద్రత కల్పిస్తుంది. ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ (Android Safe Browing) పేరుతో గూగుల్‌ ఈ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ ఫీచర్‌ థర్డ్‌ పార్టీ యాప్‌లను కూడా సపోర్టు చేస్తుంది.

యూజర్లు ఏవైనా హానికరమైన లింక్లు క్లిక్‌ చేసినా, వెబ్‌సైట్లలోకి వెళ్లినా ఈ ఫీచర్‌ వెంటనే అలెర్ట్‌ చేస్తుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే గూగుల్‌ పిక్సల్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లలో గుర్తించినట్లు ఆండ్రాయిడ్ నిపుణుడు మిషల్‌ రహమన్‌ తెలిపారు. ఈ ఫీచర్‌ ఇతర ఫోన్లకు గూగుల్‌ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మిషల్‌ రహమన్‌ X పోస్టు ఆధారంగా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ పేజీ కనిపిస్తోందన్నారు.

ఈ ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ ఫీచర్‌ హానికర లింక్‌ల నుంచి యూజర్లను కాపాడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్‌లో ఏయే థర్డ్‌ పార్టీ యాప్‌లు సపోర్టు చేస్తాయన్నది తెలియాల్సి ఉంది. రహమాన్ ట్విట్‌లోని ఎటువంటి పేర్లను వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్‌ సేఫ్టీనెట్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ API అనే లైబ్రరీని ఉపయోగిస్తుందని తెలిపారు.