ఇన్వెస్టర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 19 స్టాక్స్ ఇవే.. ఫోకస్ పెట్టి ఫాలో అవ్వండి..!!

www.mannamweb.com


Budget 2024: ఇన్వెస్టర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 19 స్టాక్స్ ఇవే.. ఫోకస్ పెట్టి ఫాలో అవ్వండి..!!

Budget Day Stocks: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగం కోసం దలాల్ స్ట్రీట్ ఎదురుచూస్తోంది. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వ తొలి బడ్జెట్ ప్రసంగంలో ఏఏ రంగాలకు ఎలాంటి ప్రకటనలు చేస్తారనే ఆసక్తి ప్రతి ఇన్వెస్టర్, ట్రేడర్‌లో ఉంది.

ఈ ఉత్కంఠ నడుమ వారు గమనించాల్సిన రంగాలు, షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో 2024 బడ్జెట్‌కు ముందు అనేక రంగాలకు చెందిన స్టాక్స్ ప్రయోజనం పొందుతాయని ఇన్వెస్టర్లు, నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజేష్ సిన్హా, బొనాంజా పోర్ట్‌ఫోలియోలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నాలుగు రంగాలకు చెందిన కొన్ని షేర్లను ఇన్నెస్టర్లు నేడు బడ్జెట్‌కి ముందు గమనించాల్సిందిగా సూచించారు.

– మౌలిక సదుపాయాల రంగంలో అహ్లువాలియా కాంట్రాక్ట్‌లు, KNR కన్‌స్ట్రక్షన్స్, PNC ఇన్‌ఫ్రాటెక్, RITES, KEC ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు రోడ్లు, రైల్వేలు, ఇతర సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్రం భారీ మెుత్తం వెచ్చించనున్నందున స్టాక్స్ ఇన్వెస్టర్లు ఫోకస్‌లో పెట్టుకున్నట్లు.

– ఇక ఇన్వెస్టర్లు గమనించాల్సిన స్టాక్స్ పరిశీలిస్తే.. టాటా పవర్ , కేపీఐ గ్రీన్, బోరోసిల్ రెన్యూవబుల్స్, అదానీ గ్రీన్, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి స్టాక్‌లు పునరుత్పాదక శక్తి, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించే విధానాల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

– క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ రంగంలో పాలిక్యాబ్ ఇండియా , డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు తయారీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహకాల నుంచి లాభపడతాయి.

– ఫార్మా అండ్ హెల్త్‌కేర్ రంగాన్ని పరిశీలిస్తే లుపిన్, సిప్లా, సన్ ఫార్మా, హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, కిమ్స్ వంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయి.

NOTE: పైన అందించిన వివరాలు బ్రోకరేజ్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.