ప్రకృతి తన ఒడిలో చాలా అందమైన, అద్భుతమైన ప్రదేశాలను దాచిపెట్టుకుంది. ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. నది లోయలు, సరస్సులు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఎత్తైన జలపాతాలు ఇలా చాలా ఉన్నాయి. అయితే మీకు భారతదేశంలో అతి పొడవైన నదుల గురించి తెలుసా? వాటిని ఎప్పుడైనా చూశారా? కాగా, నేడు వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అందమైన, అతి పొడవైన నదుల్లో నైలూ నది ఒకటి. ఇది ఆఫ్రికాలో ఉంది. దీని పొడవు దాదాపు 6,650 కిలోమీటరల్ పొడవు ఉంటుంది.ఇది భారతదేశంలో కూడా అతి పొడవైన నది. ఈ నది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈజిప్షియన్ నాగరికత నాటిది. నైలు నది, సూడాన్, ఈజిప్ట్ సహా 11 దేశాల గుండా ప్రవహిస్తూ..మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
అమెజాన్ నది. దీనికి గురించి చాలా మంది ఎక్కువగా తెలియదు. ప్రపంచంలో అతి పొడవైన నదుల్లో ఇది రెండో స్థానంలో ఉంటుంది. దీని పొడవు దాదా 6,400 కిలోమీటర్లు. అత్యంత సుందరమైన నదుల్లో కూడా ఇది ఒకటి, అమెజాన్ నది, జీవ వైవిధ్య పర్యావరణానికి జీవనాడి అని అంటారు. ఇక ఇది కొలంబియా, బ్రెజిల్ గుండా ప్రవహించి, అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోతుంది.
ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో మూడో స్థానంలో ఉండే నది యాంగ్జీ నది. ఇది ఆసియాలోనే చాలా పొడవైన నది. ఇది చైనాలో మాత్రమే ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట అయిన త్రీ గోర్జెస్ ఆనకట్టకు నిలయంగా ఉంది. అందమైన నదుల్లో ఇది కూడా ఒకటి.
ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో మిస్సిస్సిప్పి, మిస్సౌరీ నది ఒకటి. ఇది మిస్సిస్సిప్పి, మిస్సోరి, జెఫెర్సన్ నదుల సంగమం. ఈ నది ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో నాలుగో స్థానంలో ఉంటుంది. అంతే కాకుండా ఎత్తైన పర్వతాల గుండా ప్రవహించే ఈ నది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీని పొడవు దాదాపు 3,771 మైళ్లు.
ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో యెనిసీ నది ఒకటి. ఇది రష్యా,మంగోలియాకు ఎంతో ప్రయోజకరమైన నది.యెనిసీ–బైకాల్–సెలెంగా నదీ వ్యవస్థ దాదాపు 3,487 కిలోమీటర్లు (2,110 మైళ్ళు) పొడవు ఉండి, మంగోలియా నుండి మధ్య సైబీరియా మీదుగా ఆర్కిటిక్ మహాసముద్రం వరకు ప్రవహిస్తుంది.
































