తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏపీలోని జిల్లాల వారిగా పార్టీ కొత్త అధ్యక్షులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పేర్లను ఖరారు చేసిన అధిష్టానం..
మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చట్టసభలకు ఎన్నిక కాని వారు, నామినేటెడ్ పోస్టులు దక్కని వారు ఈ పదవులకు పోటీ పడ్డారు. అయితే, వీరిలో కొందరిని జిల్లా అధ్యక్షులుగా అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
పార్టీ కేంద్ర కార్యాలయంలో త్రిసభ్య కమిటీలతో జిల్లా పార్టీ కమిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు దాదాపు ఖరారు చేశారు. ఏమైనా ఒకట్రెండు అభ్యంతరాలు ఉంటే పరిశీలించి తుది లిస్టును ఖరారుకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
తిరుపతి -పనబాక లక్ష్మీ
చిత్తూరు – షణ్ముగం
రాజంపేట – సుగవాసి ప్రసాద్
ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి
అనంతపురం- కాలవ శ్రీనివాసులు
హిందూపురం – ఎంఎస్ రాజు
నంద్యాల – ధర్మవరం సుబ్బారెడ్డి
విజయనగరం -కిమిడి నాగార్జున
బాపట్ల- సలగలరాజశేఖర్
పల్నాడు – కొమ్మాలపాటిశ్రీధర్
గుంటూరు – పిల్లి మాణిక్యాలరావు
ఎన్టీఆర్ – గద్దె అనూరాధ
కృష్ణ – వీరంకి గురుమూర్తి
ఏలూరు- బడేటి చంటి
పశ్చిమగోదావరి-రామరాజు
తూర్పుగోదావరి- బొడ్డు వెంకటరమణ చౌదరి
అంబేద్కర్ కోనసీమ – గుత్తుల సాయి
కాకినాడ- జ్యోతుల నవీన్
విశాఖ – చోడే పట్టాభిరాం
అనకాపల్లి – కోటిని బాలాజీ
కర్నూల్ – వహీద్
అనకాపల్లి – కోటిని బాలాజీ
అరకు – మోజోరు తేజోవతి
శ్రీకాకుళం- మూదలవలస రమేష్


































