భారతదేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు ఇవే..

 భారతదేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాల జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2025 ప్రకారం..


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది. తర్వాత స్థానంలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఢిల్లీ), మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (మణిపాల్), జామియా మిలియా ఇస్లామియా (ఢిల్లీ) ఉన్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఐదవ స్థానంలో ఉండగా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి ఆరవ స్థానంలో ఉన్నాయి. NIRF బోధన, అభ్యాసం, పరిశోధన అవుట్‌పుట్, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, ఔట్రీచ్, ఇన్‌క్లూజివిటీ, అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని విద్యాసంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌తో అధిక పనితీరు గల సంస్థలను గుర్తించడమే కాకుండా, అత్యుత్తమ విద్యా కేంద్రాలను కూడా గుర్తించవచ్చు. విద్యార్థులకు సమాచారంతో కూడిన ఎంపికలు చేసుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను ఇది అందిస్తుంది.

ఉన్నత విద్యా సంస్థలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో, బోధనా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇటీవలి ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకడమిక్ నెట్‌వర్క్స్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వంటి పథకాలు నాణ్యమైన బోధన, ఆవిష్కరణలను పెంపొందించాయి” అని అన్నారు. న్యాయంగా, విశ్వసనీయతను పెంపొందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025లో కీలక మార్పులను ప్రవేశపెట్టిందని ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “భారత ర్యాంకింగ్స్ 2025లో గుర్తించదగిన మార్పులలో ఉపసంహరించిన వ్యాసాలకు ప్రతికూల మార్కింగ్‌ను ప్రవేశపెట్టడం కూడా జరిగిందన్నారు.

ఇండియా ర్యాంకింగ్స్ 2025: ఇంజనీరింగ్ విభాగంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల జాబితా
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
2. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
3. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
4. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
5. ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
6. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
7. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ -పిలాని
8. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
9. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా
10. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీఘర్

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.