సొంత కారు కొనాలనుకోవడం చాలా మందికి ఒక కల. అయితే తక్కువ వేతనం కలిగిన వారికి సొంతకారు కొనగడం ఒక కలగానే మిగిలిపోతుంది, నెలకు రూ.30 వేలు సంపాదించే వారు కూడా బడ్జెట్ ధరలో మంచి కార్లు కొనుక్కోవచ్చు.
నెలకు కేవలం రూ.8వేలు ఈఎమ్ఐ కడుతూ సులభంగా కారు కొనుక్కోవచ్చు. రూ.6 లక్షలలోపు కొనగలిగే టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం!
టాటా పంచ్ ( TATA Punch)
ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల – రూ.11 లక్షల వరకు ఉంది. టాటా మోటర్స్‌కు చెందిన ఈ కారు మోడల్ “NCAP” ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 1199సీసీ ఇంజిన్, 72-87 bhp పవర్ కలిగిన కారు, పెట్రోల్ మాన్యువల్ కారు 20 kmpl,పెట్రోల్ ఆటోమేటిక్ 18.8 kmpl, సీఎన్‌జీ మాన్యువల్ 26.9kmpl మైలేజీ ఇస్తాయి. మంత్లీ EMI సుమారుగా 11వేల600 ఉంటుంది.
మారుతీ వ్యాగన్ ఆర్ ( Maruti Wagon R)
ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.79 లక్షల నుండి రూ.7.62 లక్షల వరకు ఉంది. 998cc-1197cc వివిధ మోడళ్లను బట్టి వేరుగా ఉంటుంది. 23 నుండి 25 kmpl మైలేజీ ఇస్తుంది.పెట్రోల్ మరియు సీఎన్‌జీలో అందుబాటులో ఉంది.
మంత్లీ ఈఎమ్ఐ సుమారుగా రూ.11వేల 200 ఉంటుంది.
టాటా టియాగో (Tata Tiago)
ఎక్స్-షో రూమ్ ఢిల్లీ ధర రూ.5 లక్షల నుండి .55 లక్షలవరకు ఉంటుంది. టాటా మోటర్స్‌కు చెందిన ఈ కారు 1199cc ఇంజిన్‌తో 19 kmpl మైలేజీని ఇస్తుంది. గ్లోబల్ NCAP ఈ కారుక 4 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. సీఎన్‌జీ / పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మంత్లీ ఈఎమ్ఐ సుమారుగా రూ.9700 వరకు ఉంటుంది.
మారుతి ఆల్టో కె10 (Maruti Alto K10 )
ఢిల్లీ ఎక్స్-షో రూమ్ ధర రూ.4 లక్షల నుండి రూ.6 లక్షల వరకు ఉంది. 998CC ఇంజిన్ కలిగిన ఈ కారు 24.9 Kmpl మైలేజీని ఇస్తుంది. మంత్లీ ఈఎమ్ఐ సుమారుగా రూ.8వేల వరకు ఉంటుంది.
మారుతి సెలేరియో (Maruti Celerio )
ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.5.6 లక్షల నుండి రూ.7 లక్షల వరకు ఉంది. 999cc ఇంజిన్ కలిగిన ఈ కారు 26.88 kmpl మైలేజీని ఇస్తుంది. మంత్రీ ఈఎమ్ఐ సుమారుగా నెలకు రూ.11వేల వరకు ఉంటుంది. ఇక ఈ కార్ పెట్రోల్, CNG రెండు ఇంజన్స్ తో వస్తుంది.కార్ లో అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కూడా ఉండటం ఒక ప్లస్ అని చెప్పాలి. పెట్రోల్,CNG రెండిటితో ఈ కార్ మంచి మైలేజ్ ఇస్తుంది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.

































