ఈ క్రెడిట్ కార్డులకు ఏన్యువల్ ఫీజు ఉండదు; అదనపు ప్రయోజనాలు కూడా..

www.mannamweb.com


సాధారణంగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వార్షికంగా నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని బ్యాంక్ లు స్వయంగా లేదా వివిధ సంస్థలతో భాగస్వామ్యంతో వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అవి ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే అన్ని ప్రయోజనాలను కల్పిస్తాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? వార్షిక రుసుములు లేని క్రెడిట్ కార్డులు మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి పొదుపైన మార్గం అవుతుంది. అదనపు ఖర్చులు లేకుండా ఉపయోగకరమైన ప్రయోజనాలను అందించే క్రెడిట్ కార్డ్ లు అందుబాటులో ఉన్నాయి. అలా వార్షిక రుసుము లేకుండా, అన్ని ప్రయోజనాలు, రివార్డులు అందిస్తూ, ఫ్రీ సర్వీస్ ఇస్తున్న 5 క్రెడిట్ కార్డుల వివరాలను ఇక్కడ చూడండి..

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులు
1. ఆర్బీఎల్ బ్యాంక్ బ్యాంక్ బజార్ సేవ్ మ్యాక్స్ క్రెడిట్ కార్డు

ఎక్స్ ప్రెస్ క్యాష్: మీ అకౌంట్ లోకి ఇన్ స్టంట్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ అవుతాయి.

రివార్డులు: బుక్ మైషో, జొమాటో లావాదేవీలపై 10% క్యాష్ బ్యాక్ (నెలకు రూ.100 వరకు).

ఈఎంఐ ఇన్ఫినిటీ పాస్: స్ప్లిట్ అండ్ పే ఫీజుపై డిస్కౌంట్లు.

మేనేజ్మెంట్ యాప్: మీ కార్డు ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లించవచ్చు. ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. ఆర్బిఎల్ బ్యాంక్ మై కార్డ్ యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేయవచ్చు.

2. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు

రివార్డులు: అపరిమితం, గడువు లేకుండా.

రీడీమ్: అమెజాన్, ఇతర వ్యాపారుల వద్ద 100 మిలియన్లకు పైగా ఉత్పత్తుల కోసం మీ క్రెడిట్లను ఉపయోగించండి.

నో కాస్ట్ ఈఎంఐ: అమెజాన్ కొనుగోళ్లపై మూడు లేదా ఆరు నెలల వరకు అందుబాటులో ఉంటుంది.
3. హెచ్ ఎస్ బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డు

క్యాష్ బ్యాక్: హెచ్ ఎస్ బీసీ ఇండియా మొబైల్ యాప్ ద్వారా మొదటి 30 రోజుల్లో కనీసం రూ.5,000 ఖర్చు చేస్తే రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి.

ఇంధన పొదుపు: ఇంధన చెల్లింపులపై వార్షికంగా రూ.3,000 వరకు ఆదా అవుతుంది.

ఫ్లైట్ మైళ్లు: వివిధ విమానయాన సంస్థలతో రివార్డు పాయింట్లను మైళ్లుగా మార్చండి.
4. ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు

రివార్డులు: రిటైల్ స్టోర్లలో ఖర్చు చేసిన ప్రతి రూ. 100కు రెండు రివార్డ్ పాయింట్లు సంపాదించండి (పెట్రోల్ మినహా).

ఇంధన మాఫీ: హెచ్ పీసీఎల్ పంపుల్లో 1 శాతం సర్ చార్జ్ మాఫీ (రూ.4,000 వరకు).

సెక్యూర్ పేమెంట్స్: క్విక్ అండ్ సెక్యూర్ పేమెంట్ టెక్నాలజీ.
5. ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు

ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్: డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ లకు ఉచిత ప్రవేశం.

ప్రయాణ ప్రయోజనాలు: తక్కువ ఫారెక్స్ మార్కప్, ట్రిప్ క్యాన్సిలేషన్ కవరేజీ.

సినిమా టికెట్లు: పేటీఎం ద్వారా రూ.125 వరకు విలువైన బై-వన్- గెట్ వన్ సినిమా టికెట్లు.

రివార్డ్ పాయింట్లు: మీ మొదటి నాలుగు లావాదేవీలపై (రూ. 200 వరకు) 100% క్యాష్ బ్యాక్ పొందండి.
వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు

జీవితకాల ఉచితం: కార్డు సేవలను ఆస్వాదించడానికి వినియోగదారులు ఎటువంటి వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఖర్చు ఆదా: కొన్ని కార్డులు ఇంధన లావాదేవీలపై సర్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.

వివిధ సౌకర్యాలు: ఎయిర్ పోర్ట్ లాంజ్ లకు యాక్సెస్, షాపింగ్, డైనింగ్, ఫుడ్ డెలివరీ, సినిమా టిక్కెట్లు, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తాయి.

వెల్ కమ్ బెనిఫిట్స్: చాలా కార్డులు బోనస్ రివార్డ్ పాయింట్స్, వోచర్లు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్, సైన్ అప్ పై అదనపు బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
ఏన్యువల్ ఫీజు లేని క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఆన్ లైన్ అప్లికేషన్

ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇస్తున్న బ్యాంక్ ను ఎంపిక చేసుకుని ఆ బ్యాంక్ వెబ్సైట్ కు సందర్శించండి. వివరాలు చెక్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ నింపండి. అవసరమైన వ్యక్తిగత వివరాలను అందించండి. అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి. వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి. మీ దరఖాస్తును ఆమోదించే ముందు బ్యాంక్ మీ వివరాలు మరియు పత్రాలను తనిఖీ చేస్తుంది. మీకు అర్హత ఉంటే, మీకు క్రెడిట్ కార్డును మంజూరు చేస్తుంది.

ఆఫ్ లైన్ అప్లికేషన్

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు కోసం ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికిి సంబంధిత బ్యాంక్ అధికారిక బ్రాంచ్ కు వెళ్లండి. అక్కడ సిబ్బందిని సంప్రదించి, అప్లికేషన్ ఫామ్ ను నింపండి. అవసరమైన వ్యక్తిగత వివరాలను అందించండి. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. మీ దరఖాస్తును ఆమోదించే ముందు బ్యాంక్ మీ వివరాలు మరియు పత్రాలను సమీక్షిస్తుంది.
సరిగ్గా వాడకపోతే నష్టపోతారు..

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను చవకైన ఆర్థిక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇతర క్రెడిట్ కార్డుల (CREDIT CARD) మాదిరిగానే, గడువు తేదీలోగా మీ బకాయిని చెల్లించకపోతే, అధిక వడ్డీ బారిన పడే ప్రమాదముంది. అందువల్ల, ప్రతీ నెల గడువులోపు మొత్తం బకాయి చెల్లించే అలవాటు చేసుకోండి. వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు, రివార్డు ప్రోగ్రామ్ లు, వడ్డీ రేట్లు, క్రెడిట్ పరిమితులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోండి.