పిల్లలు బాగా సన్నగా, బలహీనంగా ఉన్నారా.. ఈ ఫుడ్స్ బెస్ట్

www.mannamweb.com


కొంత మంది పిల్లలు బక్క పల్చగా, బలహీనంగా ఉంటారు. ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల తల్లిదండ్రులు చాలా బాధ పడుతూ ఉంటారు..

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. వారి కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. కానీ కొంత మంది పిల్లలు అసలు సరిగా తినరు. దీంతో చాలా సన్నగా, నీరసంగా ఉంటారు. యాక్టీవ్‌గా కూడా ఉండరు. దీంతో పేరెంట్స్ కూడా చాలా బాధ పడుతూ ఉంటారు. పిల్లల మానసిక ఎదుగుదలపైనే కాకుండా శారీరంపై కూడా దృష్టి పెట్టాలి. పిల్లలు బక్క పల్చగా, ఎముకలు కనిపించేలా ఉన్నారంటే వారిలో అనేక సమస్యలు ఉన్నాయని కనిపెట్టాలి. వైద్యుల సలహా మేరకు వారికి ఆహారాన్ని పెట్టాలి. కొన్ని రకాల ఆహారాలను వారి భోజనంలో యాడ్ చేయాలి. ఇవి పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరిగేలా చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

అరటి పండు:

ప్రతి రోజూ పిల్లలకు ఒక అరటి పండు తినిపించండి. అరటి పండు తినిపించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరుగతారు. ఈ పండులో విటమిన్లు సి, ఎ, బి6తో పాటు ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. అరటి పండు పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాక్టీవ్‌గా కూడా ఉంటారు.
నెయ్యి:

పిల్లలకు పెట్టాల్సిన ఆహారాల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యి పెట్టడం వల్ల పిల్లల స్కిన్‌, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరం బరువుగా, దృఢంగా పెరిగేలా చేసతాయి. మంచి కొవ్వులు లభిస్తాయి. బ్రెయిన్ కూడా యాక్టీవ్‌గా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి.. త్వరగా జబ్బుల బారిన పడకుండా చేస్తాయి.

కోడి గుడ్డు:

ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డును పిల్లల చేత తినిపించాలి. ఇది పిల్లలకు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి పిల్లలు బరువు పెరిగేలా చేస్తాయి. ప్రతి రోజూ గుడ్డు తినే పిల్లల ఎదుగుదలలో కూడా మార్పులు కనిపిస్తాయి. పిల్లలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో గుడ్డు ఎంతో హెల్ప్ చేస్తుంది.
పాలు:

పాలు ఇవ్వడం వల్ల కూడా పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అంతే కాకుండా పిల్లల స్కిన్, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు పిల్లలకు చక్కగా అందుతాయి. వారు యాక్టీవ్‌గా ఉండేలా చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు పాలు ఇవ్వడం చాలా మంచిది. అదే విధంగా తేనె పెట్టినా మంచిదే.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)