మెర్కోర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్రూటింగ్ స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురు స్నేహితులు ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులోనే సొంతంగా ఎదిగిన బిలయనీర్లుగా నిలిచారు.
ఇప్పటి వరకు మార్క్ జుకర్‌బర్గ్ పేరిట ఈ రికార్డు ఉంది. AI రిక్రూటింగ్ స్టార్టప్ అయిన మెర్కోర్‌ను ముగ్గురు హైస్కూల్ స్నేహితులు – బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్ ,సూర్య మిధా స్థాపించారు.
ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ స్టార్టప్ ఇటీవలే 350 మిలియన్ డాలర్ల ఫండింగ్ సేకరించింది, దీంతో కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కంపెనీ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా నిలిచారు. Mercor కంపెనీ వ్యవస్థాపకుడు, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే బిలియన్ డాలర్ల మార్కు దాటిన యువ వ్యాపారవేత్తల స్థానంలో నిలిచారు.
ఇద్దరు భారతీయ-అమెరికన్లు
సొంతంగా ఎదిగిన బిలయనీర్లుగా నిలిచిన Mercor వ్యవస్థాపకుల్లో ఇద్దరు ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా ఇద్దరు భారతీయ-అమెరికన్లు కావడం విశేషం. ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా కాలిఫోర్నయాలోని శాన్ జోస్‌లో ఉన్న బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్లో కలిసి చదువుకున్నారు. సూర్య మిధా తల్లిదండ్రులు న్యూఢిల్లీ నుండి అమెరికాకు వలస వెళ్లారు.
ఇద్దరూ చదువును వదిలేసి
ఆదర్శ్ హిరేమత్ హార్వర్డ్ యూననివర్సిటీలో సైన్స్ చదువుతూ, మెర్కోర్ కోసం రెండేళ్లకే చదువు ఆపేశాడు. మెర్కోర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్రూటింగ్ స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురు స్నేహితులు ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులోనే సొంతంగా ఎదిగిన బిలయనీర్లుగా నిలిచారు.
స్కూల్ ఫ్రెండ్స్ నుండి బిలియనీర్ల వరకు ఎదిగారు…
మెర్కోర్ వ్యవస్థాపకులైన ఆదర్శ్ హిరేమత్ , సూర్య మిధా మధ్య స్నేహం హైస్కూల్ నుండే ఉంది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బాలుర పాఠశాలలో వీరిద్దరు స్నేహితులయ్యారు. అక్కడ వారు డిబేట్ టీమ్‌లో టాప్ మెంబర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తులుగా నిలిచారు. ఈ తొలి విజయం వ్యవస్థాపకులుగా వారి భవిష్యత్ భాగస్వామ్యానికి పునాది వేసింది.
భారతీయ అమెరికన్, హిరేమత్ తరువాత కంప్యూటర్ సైన్స్ చదవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు, కానీ రెండు సంవత్సరాల తర్వాత పూర్తిగా మెర్కోర్ పై దృష్టి పెట్టడానికి అక్కడి నుండి వెళ్లిపోయాడు సూర్య మిధా జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఫారిన్ సర్వీస్‌లో డిగ్రీని అభ్యసించాడు, అక్కడ ఆర్థిక శాస్త్రం చదువుతున్న బ్రెండన్ ఫుడీని కలిశాడు. మెర్కోర్‌ను నిర్మించడానికి, వ్యవస్థాపకత , సాంకేతికత పట్ల వారి అభిరుచులు కలిశాయి. దీంతో హిరేమత్‌తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు.
































