ఈ స్కాలర్​షిప్స్​తో అమెరికా, యూకేలో చదుకోవచ్చు- ట్యూషన్​ ఫీజుకు ఆర్థిక సాయం, స్టైఫండ్​ కూడా.

విదేశాల్లో చదువుకోవాలన్న మీ కలను నెరవేర్చుకునేందుకు కొన్ని అంతర్జాతీయ స్కాలర్​షిప్స్​ అందుబాటులో ఉన్నాయి. అవి ట్యూషన్​ ఫీజు, జీవన- ప్రయాణ ఖర్చులను సైతం అందిచడమే కాకుండా, స్టైఫండ్​ని కూడా ఇస్తుంటాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి! ఈ స్కాలర్‌షిప్‌లు అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయిల వారికి పూర్తి లేదా పాక్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు, సంస్థలు వీటిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్కాలర్​షిప్​లు, వాటి అప్లికేషన్​ గడువు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


విదేశాల్లో విద్య- ముఖ్యమైన స్కాలర్‌షిప్‌లు- డెడ్‌లైన్స్..

  1. ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ – మాస్టర్స్ – పీహెచ్‌డీ

దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 15, 2025

వివరాలు: 160కి పైగా దేశాల్లో లభించే ఈ స్కాలర్‌షిప్.. గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నిపుణులు, కళాకారులు అమెరికాలో చదువుకోవడానికి లేదా పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఏటా దాదాపు 4,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.

2. కామన్‌వెల్త్ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు

దరఖాస్తు గడువు: అక్టోబర్ 5, 2025

వివరాలు: కామన్‌వెల్త్ దేశాల్లోని అభివృద్ధి చెందుతున్న, వెనకపడిన దేశాల పరిశోధకులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. యూకే యూనివర్సిటీల్లో ఫుల్-టైమ్ డాక్టోరల్ స్టడీస్ కోసం ఈ స్కాలర్‌షిప్‌లు నిధులు అందిస్తాయి.

3. DAAD EPOS MIDE – మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (ఎంఐడీఈ)

దరఖాస్తు గడువు: ఆగస్టు 31, 2025

వివరాలు: అభివృద్ధి చెందుతున్న దేశాలు, కొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల అభ్యర్థుల కోసం ఈ స్కాలర్‌షిప్. స్థిరమైన అభివృద్ధికి దోహదపడే నిపుణులకు శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం.

4. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌లు – బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ

దరఖాస్తు గడువు: నవంబర్ 1, 2025

వివరాలు: స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, పీహెచ్‌డీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, స్టైపెండ్లు, అసిస్టెంట్‌షిప్ జీతాలతో కలిపి ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తుంది.

5. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌లు – యూజీ, మాస్టర్స్, పీహెచ్‌డీ

దరఖాస్తు గడువు: అక్టోబర్ 16, 2025

వివరాలు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మెరిట్ ఆధారంగా అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఇవి ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్‌లు, స్కాలర్‌షిప్ పోర్టల్‌లను సందర్శించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.