టాలీవుడ్ ఇండస్ట్రీలో వినూత్న చిత్రాల దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రవి బాబు(Ravi Babu) అనే చెప్పాలి. రెగ్యులర్ సినిమాలకు ఆయన సినిమాలకు చాలా వైవిధ్యం ఉంటుంది.
కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు ఆయన. కాన్సెప్ట్, కథలు, కథనం కూడా చాలా వింతంగా ఉంటుంది. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, అమరావతి, అనసూయ, అవును.. ఇలా ప్రతీ సినిమా దేనికదే వినూత్నంగా ఉంటాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన లేటెస్ట్ మూవీ “ఏనుగుతొండం ఘటికాచలం”. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయ్యింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు రవి బాబు తన సినిమాల గురించి, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “తెలుగు సినిమాలు నాకు చాలా వింతగా అనిపిస్తాయి. మనవాళ్ళు యాక్టింగ్ చేయరు ఓవర్ యాక్టింగ్ చేస్తారు. నేను కూడా ముందు నార్మల్ గా నటించేవాణ్ణి. కానీ, ఓవర్ యాక్టింగ్ చేయాలనీ అర్థమయ్యింది. మురారి సినిమాలో అలాగే ఓవర్ యాక్టింగ్ చేశాను. అది చాలా మందికి నచ్చింది. విలన్ గా కూడా అలాగే చేశాను. నన్ను చూసి బయట కూడా భయపడుతున్నారు”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































