ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే..
ఎక్కువ ఎండుద్రాక్షకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిని తింటే బరువు పెరుగుతారు. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఎండుద్రాక్షలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి.. దాని పరిమాణాన్ని పరిమితంగా ఉండాలని అంటున్నారు.
మధుమేహంతో బాధపడేవారు ఎందు ద్రాక్ష తీసుకోవడం తగ్గించాలంటున్నారు నిపుణుల. . ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్‌లో ఎక్కువగా ఉంటాయి. అలాగే, జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. ద్రాక్ష జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, వాటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కిస్‌మిస్ తినకూడదని చెబుతున్నారు. ద్రాక్షలో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, కిస్‌మిస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యను మరింత పెంచుతుంది.
ద్రాక్షలో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణకోశ సంబంధిత రుగ్మతలు ఉన్నవారు కిస్‌మిస్ తింటే సమస్యలు మరింత ఎక్కువగా ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితిలో, ద్రాక్ష తినడం వారి సమస్యలను పెంచుతుంది.
అలాగే, గ్రేప్ అలెర్జీ బాధితులు ద్రాక్షను తినకూడదు. ఎందుకంటే ద్రాక్షలో సల్ఫైడ్ ఉంటుంది. డ్రైఫ్రూట్స్‌లో సాధారణంగా కనిపించే వాటిలో ఇది ఒకటి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల అలర్జీ ఉన్నవారికి సమస్యలు వస్తాయి. అదేవిధంగా, ద్రాక్షను ఒకేసారి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వాటిని ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.