163 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్

ఏథర్​ 450ఎక్స్​, ఓలా ఎస్​1 ప్రో వంటి ఎలక్ట్రిక్​ స్కూటర్లకు గట్టి పోటీని ఇస్తున్న రివర్​ ఇండీపై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది! డిసెంబర్​లో ఈ మోడల్​పై మంచి బెనిఫిట్స్​ని పొందవచ్చు. ఈ నేపథ్యంలో డిస్కౌంట్స్​తో పాటు ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘రివర్ మొబిలిటీ’ సంస్థ, తన పాపులర్ స్కూటర్ ‘రివర్ ఇండీ’ పై భారీ ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది! ఏథర్ 450ఎక్స్​, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్​1 ప్రో వంటి అగ్రశ్రేణి స్కూటర్లకు పోటీగా నిలుస్తున్న ఈ మోడల్‌పై డిసెంబర్ 31, 2025 వరకు ఏకంగా రూ. 22,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.


ఈ ఏడాది చివరి నెలలో విక్రయాలను మరింత పెంచుకోవాలని రివర్ మొబిలిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భారీ డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​: డిసెంబర్ స్పెషల్ ఆఫర్లు ఇవే!

ఈ నెలలో రివర్ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్ కొనేవారికి క్యాష్‌బ్యాక్, తక్కువ డౌన్ పేమెంట్, ఈఎంఐ వంటి అనేక ఫైనాన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి..

రివర్​ ఇండీ- ఇయర్​ ఎండ్​ బెనిఫిట్స్​
ఇయర్​ ఎండ్​ బెనిఫిట్స్​ బెనిఫిట్స్​ వివరాలు
పూర్తి బెనిఫిట్స్​ రూ. 22,500 వరకు ఫైనాన్సింగ్​, క్యాష్​బ్యాక్​, ఈఎంఐలు
క్యాష్​బ్యాక్​ రూ. 7,500 వరకు COCO స్టోర్స్​లో ఎంపిక చేసిన క్రెడిట్​ కార్డులపై
కనిష్ఠ డౌన్​పేమెంట్​ రూ. 14,999 Evfin, IDFC ద్వారా
యాక్ససరీ ఈఎంఐలు రూ. 14,000 వరకు దేశవ్యాప్తంగా

 

1. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు: కంపెనీకి చెందిన సొంత షోరూమ్‌లలో (COCO Stores) ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ. 7,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది.

2. తక్కువ డౌన్​పేమెంట్: డబ్బు మొత్తం ఒకేసారి చెల్లించలేని వారి కోసం కంపెనీ ‘లో డౌన్​పేమెంట్’ ఆప్షన్ తెచ్చింది. కేవలం రూ. 14,999 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని కోసం కంపెనీ Evfin, ఐడీఎఫ్​సీ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది.

3. యాక్సెసరీలపై ఈఎంఐ: సాధారణంగా స్కూటర్ కొనేటప్పుడు యాక్సెసరీస్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రివర్ మొబిలిటీ ఇప్పుడు రూ. 14,000 వరకు విలువైన యాక్సెసరీస్‌ను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ స్కూటర్‌ను నచ్చిన విధంగా అలంకరించుకోవడానికి ఒకేసారి భారం పడదు.

రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​- రేంజ్​..

రివర్​ ఇండీ జెన్​ 3 మోడల్​ 2 నెలల ముందు లాంచ్​ అయ్యింది. ఇందులో 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఏకంగా 163 కి.మీ రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. బ్యాటరీని 0-80శాతం ఛార్జ్​ చేసేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని సంస్థ వెల్లడించింది. ఈ ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 90కేఎంపీహెచ్​. ఇందులో 6.7 కేడబ్ల్యూ మోటార్​ 8.9 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 43 లీటర్ల అండర్​ సీట్​ స్టోరేజ్​ ఉండటం హైలైట్​. దీనితో పాటు 12 లీటర్ల గ్లోవ్​బాక్స్​ కూడా ఉంది.

ఈ రివర్​ ఇండీ ఈవీ 5 కలర్​ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.45లక్షలు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.