డయాబెటిస్. దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. యుక్త వయస్సులో ఉన్న వారు అధిక శాతం మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు..
జీవన శైలి ఈ వ్యాధి వచ్చేందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇక, డయాబెటిస్ వచ్చిన వారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఆహారంలో పిండి పదార్థాలు, చక్కెరలు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ ఉండే ఆహారాలను తినాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కొబ్బరినూనెను రోజూ వంట నూనెగా ఉపయోగించవచ్చు. లేదా రాత్రి పూట నిద్రకు ముందు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది. దీని ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. దీంతో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే అజీర్తి సమస్య ఉంటుంది. ఆహారం జీర్ణమవడం ఆలస్యం అవుతుంది. కానీ కొబ్బరినూనెను తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఇలా చేయటం ద్వారా ఆహారం సులభంగా జీర్ఱం అవుతుంది. అజీర్తి ఉండదు. అలాగే షుగర్ ఉంటే మలబద్దకం కూడా ఇబ్బంది పెడుతుంది. కానీ కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల మల బద్దకం అన్న మాటే ఉండదు. రోజూ ఉదయం సుఖంగా విరేచనం అవుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. కొబ్బరినూనె యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల ను తగ్గిస్తుంది. ప్రధానంగా చర్మంపై, జననావయవాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినూనెను తీసుకుంటే ఇలా అనేక రకాలుగా లాభాలను పొంద వచ్చుని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే డాయాబెటిస్ మందులు వాడుతున్న వారు మాత్రం వైద్యుడి సలహాలు తీసుకున్న తరువాత మాత్రమే వినియోగించటం మంచిదని సూచిస్తున్నారు.
































