ఇది కదా సినిమా అంటే.. రూ. 15 కోట్లతో తీస్తే రూ. 875 కోట్లు వచ్చాయ్..

సినిమా హిట్ కావాలంటే ప్రేక్షకుల్ని మెప్పించాలి. వారి మనసుల్ని కదిలించాలి. వారిని సినిమాలో భాగం చేసే కథ దొరికాలి. అప్పుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.


ఎన్ని కోట్లతో తీశామన్నది ముఖ్యం కాదు.. జనాలకు కనెక్ట్ అయితే ఎన్ని కోట్లు వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. ఈ విషయాన్ని ఓ సినిమా నిరూపించింది. కేవలం రూ. 15 కోట్లతో ఈ మూవీ నిర్మిస్తే ఏకంగా రూ. 875 కోట్లు కొల్లగొట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే మూవీ తిరుగులేని విజయం సాధించింది. అలాగని ఈ మూవీలో పెద్ద పెద్ద హీరోలు ఎవరూ లేరు. కేవలం కథతోనే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇండియన్ చిత్ర సీమలో ఈ మూవీ చాలా ప్రత్యేకం. బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కేవలం రూ. 15 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 876 కోట్లు వసూలు చేసి బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలిచింది. అదే ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ మూవీ. ఈ మూవీలో స్టార్స్ ఎవరూ లేకపోవడం విశేషం. అద్వైత్ చందన్ దర్శకత్వంలో జైరా వాసిం హీరోయిన్‌ గా ఈ మూవీ తెరకెక్కింది. గాయని కావాలనుకునే టీనేజర్ కలలను సాధించే కథాంశంగా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీలో జైరా వాసిం అద్భుత నటనతో ప్రశంసలు అందుకుంది.

కథేంటి..?

సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ కథ విషయానికి వస్తే.. గాయని కావాలని కోరుకునే సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక టీనేజర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన ఫేస్ రివీల్ చేయకుండా హీరోయిన్.. ఈ సినిమాలో బురఖా ధరించి సామాజిక మాధ్యమాల్లో సింగింగ్ వీడియోలను అప్‌ లోడ్ చేస్తుంది. అలా క్రమంగా సంచలనం అవుతుంది. ఈ మూవీలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించారు. ఇక ఈ సినిమాను కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో తీశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 876 కోట్లు వసూలు చేసింది. భారత్ లో దాదాపు రూ. 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ మూవీ టీమ్ అందుకుంది. ఈ మూవీ యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.