థైరాయిడ్ పేషెంట్లు తప్పక తినాల్సిన సూపర్ ఫుడ్‌ ఇది..! ఈ చిన్న గింజల్లో పోషకాలు తెలిస్తే..

www.mannamweb.com


గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు మనకు చాలా కాలం పాటు ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.

గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి చాలా ముఖ్యమైన ఖనిజం.

థైరాయిడ్ అనేది మెడ ముందుభాగంలో ఉన్న ఒక గ్రంథి. ఇది శరీరంలోని వివిధ ప్రక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. థైరాయిడ్‌ నుంచి బయటపడాలి అనుకొనేవారు గుమ్మడి గింజలను తీసుకోవాలి.

గుమ్మడి గింజలు అనేవి కేవలం రుచిని పెంచేవి మాత్రమే కాదు. ముఖ్యంగా థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారికి ఇవి అద్భుతమైన మందు. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

గుమ్మడి గింజలు దీర్ఘకాలిక వాపును తగ్గించడంలో సహాయపడతాయి. థైరాయిడ్ సమస్యలు చాలా సందర్భాలలో దీర్ఘకాలిక వాపుతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ చిన్న గింజల్లో ప్రోటీన్లు, ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి.

థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అవసరం. గుమ్మడి గింజలు అయోడిన్‌ను సమతౌల్యం చేయడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పురుషులలో ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి.

రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులను తగ్గిస్తాయి. గుమ్మడి గింజలు చూడడానికి చిన్నవిగా అనిపించినా అందులో దాగి ఉన్న పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మంచి నిద్రకు దోహదపడుతుంది.