ఇది కాకి కాదు మేధావి, దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే

ప్రకృతిలో అనేక జంతువులు, పక్షులు చేసే పనులు చాలా సార్లు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఒక కాకి దాని అద్భుతమైన తెలివితేటలతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వైరల్ వీడియోలో ఆ పక్షి కష్టపడి పనిచేయడం కంటే.. తెలివితేటలను ఎలా ఉపయోగించాలో నిరూపించింది. అది అనుసరించిన పద్ధతి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.

వైరల్ వీడియో ప్రారంభంలో కాకి మొదట ఇటుక సహాయంతో వాల్‌నట్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. అయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది. కాకి నిరుత్సాహపడకుండా.. వాల్‌నట్‌తో రోడ్డుపైకి చేరుకుంది. రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనాల టైర్ల కింద వాల్‌నట్స్‌ను పెట్టింది. ఓ కారు దాని పై నుంచి వెళ్తుంది. దీంతో ఆ వాల్‌నట్స్ ముక్కులగా మారింది. ఆ కాకి ఆనందంగా దాన్ని తీసుకుని తిని ఎగిరిపోతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.