అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు శుభ సమయం ఇదే.. పూర్తి వివరాలు

అక్షయ తృతీయ వచ్చేసింది!


పవిత్రమైన అక్షయ తృతీయ రేపే. బంగారం కొనుగోలు చేయడం ఈ రోజున ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కూడా కలవడంతో ఈ రోజు మరింత విశిష్టతను సంతరించుకుంది.

వాస్తవానికి తిథి ఇప్పటికే ప్రారంభం కానుంది – అంటే ఈ రోజు సాయంత్రం 5:32కి మొదలవుతుంది. రేపు మధ్యాహ్నం 2:15 వరకు కొనసాగుతుంది. అంటే బంగారం కొనుగోలు కోసం రేపు ఉదయం 5:32 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు ఉత్తమ సమయం.

వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయగా జరుపుకుంటారు. పూజలు, హోమాలు, దానాలు, ప్రత్యేక ఆచారాలు చేయడం వల్ల శాశ్వత ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు శుభఫలితాలను ఇస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది.

ఈ సారి రోహిణి నక్షత్రం కూడా కలిసివస్తుండటంతో ఇది మరింత పవిత్ర దినంగా మారింది. దీనివల్ల బంగారం కొనుగోళ్లపై ప్రజల్లో ఆసక్తి పెరగనుందని భావిస్తున్నారు.

ఇక బంగారం ధర విషయానికి వస్తే – కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్ళీ పెరుగుతుండటం కొంతమంది కొనుగోలుదారులకు నిరాశను కలిగించింది. 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పెరిగి రూ.98,900కి, 22 క్యారెట్ల బంగారం రూ.450 పెరిగి రూ.91,580కి చేరింది.

ధర తగ్గుతుందనుకుని ఎదురుచూస్తున్న వారికి ఈ పెరుగుదల కొంత షాక్‌గా మారింది. అయినా కూడా, అక్షయ తృతీయ శుభతార్కికత దృష్ట్యా చాలా మంది కొనుగోళ్లను కొనసాగించనున్నారని అంచనా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.