ఎకరానికి రూ.3 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టే పంట ఇది. ఇది ఏ పంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

సీజనల్ పంటల సాగులో రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఎకరానికి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ పంట గురించి మీకు తెలుసా…


ఏం పంట అది అని ఆలోచిస్తున్నారు కదా. శాండల్ వుడ్ మొక్కల ఫార్మింగ్ లేదా శ్రీగంధం సాగు మనం వాడక భాషలో చందనం అంటారు. దీనికి ఎక్కువగా నీటి అవసరం లేదు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఎరువుల అవసరం కూడా ఎక్కువగా లేదు. అప్పుడప్పుడు సేంద్రియ ఎరువులు వేస్తే చాలు. పంట వేసిన మూడేళ్ల తర్వాత నుండి నీటి అవసరం కూడా ఎక్కువ ఉండదు.

అయితే ఖరీదైన చెట్లు కావడంతో ముదురు చెట్లకు దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చెట్లకు ఆరేళ్లు దాటిన తర్వాత అక్కడక్కడ సిసి కెమెరాలు అమర్చుకొని కాపాడుకోవాలి. సాధారణంగా గంధపు చెట్లు పక్కన ఉన్న ఇతర చెట్ల వేర్లపై ఆధారపడి పోషకాలను గ్రహిస్తాయి. కాబట్టి గంధపు చెట్ల మధ్య ఇతర పంటలను కూడా సాగు చేయవచ్చు. ఇది గంధపు చెట్లకు హెల్ప్ అవుతుంది. ఇతర పంటల వలన మీకు కూడా డబుల్ ఆదాయం వస్తుంది. ఈ చెట్లు 20 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. 12 నుంచి 15 ఏళ్లకు చెట్లు కోతక వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి కనీసం 15 నుంచి 20కేజీ ల మంచి గంధపు చెక్క లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో కిలో గంధపు చెక్క ధర 5000 నుంచి 12,000 వరకు ఉంది. ఈ లెక్కన ఒక్కో చెట్టుకు కనీసం ఒక లక్ష అంటే ఒక ఎకరానికి 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ముఖ్యంగా ఫామ్ హౌజులు ఏర్పాటు చేసుకునే వారికి ఇది ఎంతగానో చక్కగా ఉపయోగపడే మొక్క అని చెప్పవచ్చు. అలాగే మీ ప్రాంతంలో పంటలు రాబడి ఎక్కువగా లేనట్లయితే మెట్ట ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా చక్కగా రాబడిని అందించే మార్గం అని చెప్పవచ్చు. దీంతోపాటు శ్రీ గంధం మొక్కల పెంపకానికి ఖర్చు కూడా చాలా తక్కువ అని రైతులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.