ఈ 5 ప్రమాదకర వ్యాధులకు మామిడాకులు శత్రువు.. వాడాల్సిన విధానమిదే

www.mannamweb.com


మామిడి లాగే మామిడి ఆకులు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం, ఇవి చక్కెర, రక్తపోటు వంటి వ్యాధులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని వాడటానికి సరైన మార్గం గురించి తెల్సుకోండి.

పండ్ల రారాజు అయిన మామిడి రుచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు అందరికీ ఇష్టమైన పండు ఇది. వేసవిలో వచ్చే మామిడి పండ్లను అనేక రకాలుగా తింటారు. ఊరగాయలు, చట్నీలు, మురబ్బ వంటి ఎన్నో రుచి పదార్థాలు తయారు చేస్తారు. కానీ మామిడి పండ్లు, కాయల మాదిరిగానే దాని ఆకులు కూడా ఆల్ రౌండర్లు అని మీకు తెలుసా? ఆయుర్వేదం ప్రకారం ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మామిడి ఆకుల్లో ఎన్నో వ్యాధులతో పోరాడే గుణాలున్నాయి. వాటిని ఎలా వాడాలో తెల్సుకుందాం.

షుగర్:

ఆయుర్వేదం ప్రకారం మామిడి ఆకులు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే టానిన్లు మధుమేహాన్ని చాలా వరకు నియంత్రిస్తాయి. ఇందుకోసం మామిడి ఆకులను రోజూ ఉదయాన్నే పచ్చి మామిడాకులను నమిలి తినాలి. ఈ ఆకులను బాగా ఎండబెట్టి పొడి తయారు చేసుకుని తినవచ్చు. వీటితో పాటు మామిడి ఆకులను నీటిలో మరిగించి, ఈ నీటిని తాగడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉదర సంబంధిత వ్యాధులు:

మామిడి ఆకులతో కడుపుకు సంబంధించిన వ్యాధులను కూడా చాలా వరకు అధిగమించవచ్చు. సరైన జీర్ణక్రియ కోసం, చర్మం లోపలి నుంచి మెరుపు కోసం ఈ ఆకులను తినవచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో లేత మామిడి ఆకులను నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఈ చిట్కా పాటించడం వల్ల కడుపులో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయి.
మానసిక ఆరోగ్యం:

మామిడి ఆకుల సహాయంతో ఆందోళన స్థాయిలను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని కోసం మీరు మీ స్నానం చేసే నీటిలో మామిడి ఆకులను వేయాలి. మామిడి ఆకుల నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి తాజాగా అనిపిస్తుంది. ఇది మనస్సును రిలాక్స్ చేస్తుంది. దీంతో ఆందోళన స్థాయి తగ్గుతుంది.

జలుబు:

మామిడి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి జలుబు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. జలుబు, శ్వాసకోశ సమస్యలకు మామిడి ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం మామిడి ఆకులను నీటిలో మరిగించి వడగట్టాలి. ఇప్పుడు ఈ నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి టీలా వేడి వేడిగా తినండి. దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
అధిక రక్తపోటు

అధిక రక్తపోటు సమస్య ఉన్నా మామిడి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే హైపోటెన్సివ్ గుణాలు రక్తపోటును తగ్గిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు లేత మామిడి ఆకులను బాగా మెత్తగా నమిలి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటే మామిడి ఆకులను ఉడకబెట్టి ఆ టీని కూడా తాగవచ్చు.