ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

www.mannamweb.com


ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంఎన్సీ కంపెనీల మద్యం బ్రాండ్లను తిరిగి తీసుకొస్తున్నట్టు ఏపీ సర్కార్ తెలిపింది.

మెక్డోడోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను మరికొద్ది రోజుల్లోనే తీసుకొస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే రాష్ట్రానికి తిరిగి వస్తాయన్నారు. అటు అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

అలాగే గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది విషయం విదితమే. లక్కీ డ్రా పద్దతిలో వారికీ షాపులు కేటాయిస్తామని పేర్కొంది. ఇక మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

అటు రాష్ట్రంలో 12 ప్రీమియమ్‌ లిక్కర్‌ షాపుల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ షాపులకు రూ. కోటి ఫీజు కాగా.. నాన్‌ రిఫండబుల్ అడ్వాన్స్‌ రూ 15 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం.