మీకు SBIలో అకౌంట్ ఉందా.. నామినీ ప్రాసెస్ ఇదే.. ఇంట్లోంచే పూర్తి చేయొచ్చు

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? అయితే బిగ్ అలర్ట్. మీరు మీ ఖాతాకు నామినీ పేరును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా సులభం. ఇంట్లో నుంచే ఆన్‌ లైన్ ద్వారా నామినీ పేరును రిజిస్టర్ చేయవచ్చు. అలాగే బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి పూర్తి చేయవచ్చు. మరి ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. కోట్లాది మంది ఈ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సహా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వంటి ఖాతాలు కలిగి ఉన్నారు. అయితే, బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా నామినీ పేరును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ ఇంకా చాలా మంది చేయలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. మరి మీరు కూడా మీ ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాకు నామినీని రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.


ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా

మీరు మీ ఎస్‌బీఐ అకౌంటుకు ఆన్‌లైన్ ద్వారా నామినీ యాడ్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో కనిపించే ఆన్‌లైన్ నామినేషన్ సెలెక్ట్ చేయాలి. మీరు ఏ బ్యాంకు ఖాతాకు నామినీ యాడ్ చేయాలనుకుంటున్నారో అకౌంట్ నంబర్ ఎంచుకోవాలి. ఆ తర్వాత నామినీ వివరాలను నింపాలి. అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

యోనో యాప్ ద్వారా

మీరు యోనో యాప్ ద్వారా నామినీ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే ముందుగా యాప్ ఓన్ చేసి అందులోని సర్వీసెస్ అండ్ రిక్వెస్ట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత అకౌంట్ నామినీ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మేనేజ్ నామినీ ఎంచుకోవాలి. కిందకు వెళ్లిన తర్వాత అకౌంట్ నంబర్ ఎంచుకోవాలి. నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్ ద్వారా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ద్వారా నామినేషన్ రిజిస్టర్ చేయవచ్చు. హోమ్ బ్రాంచు నుంచి నామినేషన్ ఫారం తీసుకోవాలి. నామినేషన్ వివరాలను సరిగ్గా నింపాలి. సంతకాలు చేసి హోమ్ బ్రాంచులో సబ్మిట్ చేయాలి. ఫారం అందించిన తర్వాత రిసీప్ట్ తీసుకోవాలి. ఇది మీ రిజిస్ట్రేషన్ ప్రూఫ్‌గా పని చేస్తుంది.

ఖాతాదారు మరణించిన సందర్భంలో అకౌంట్, లాకర్, సేఫ్ కస్టడీలోని బ్యాలెన్స్, విలువైన వస్తువులను క్లెయిమ్ చేసేందుకు ఒక వ్యక్తిని అపాయింట్ చేయడాన్నే నామినీ అంటారు. డిపాజిట్ అకౌంట్లు, సేఫ్ కస్టడీ ఆర్టికల్స్, సేఫ్ డిపాజిట్ వాల్ట్స్ వంటి వాటికి నామినీ సౌకర్యం ఉంటుంది. వ్యక్తిగత, జాయింట్ ఖాతాలకు ఇది వర్తిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.