చంద్రబాబు రోజూ అల్పాహారం ఇలా తింటారు…ఏపీ సీఎం డైట్ సీక్రెట్స్

ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వయసులో కూడా ఆయన చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆయన ఈ వయసులో కూడా యువకుల కంటే వేగంగా పని చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా చంద్రబాబు బాగానే చూసుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఈ క్రమంలో ఆయన అనేకమార్లు తన ఆరోగ్య రహస్యాలను ప్రజలకు చెప్పారు.


సమయానికి భోజనం చెయ్యాలన్న చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో డిసిప్లిన్ అవసరమని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి భోజనం చేయాలని చంద్రబాబు చెబుతారు. తను అదేవిధంగా సమయానికి భోజనం చేస్తానని చెబుతారు. సమయానికి భోజనం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు తినటం మంచిది కాదని ఆయన చెప్తారు.

ఆహారంలో వీటిని తక్కువ చెయ్యాలన్న చంద్రబాబు అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెర వంటి వాటి వాడకం తగ్గించాలని, వీటి కారణంగానే అనారోగ్య సమస్యలు వస్తాయని చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు కూడా గణనీయంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తను కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటానని చంద్రబాబు తెలిపారు.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇదే తింటానన్న చంద్రబాబు ప్రతిరోజు ఉదయాన్నే తాను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఆమ్లెట్ తింటానని చెప్పారు చంద్రబాబు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను బట్టి తన ఆహారపు అలవాట్లు మార్చుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే తన ఆరోగ్యం కోసం మిల్లెట్ ఆహారాన్ని తను తీసుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు ప్రోటీన్లతో పాటు సమతుల ఆహారం కోసం సిరి ధాన్యాలను, పండ్లను ఆహారంగా తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

మనం తినే తిండి, మన అలవాట్లు, జీవన శైలితోనే ఆరోగ్యం అన్న చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పైన జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. బియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, మనిషి ఆరోగ్యం మనం తినే తిండి, మన అలవాట్లు, జీవన శైలి పైన ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.