నెల రోజుల పాటు గుడ్డు తిన్నారంటే జరిగేదిదే..

నాన్ వెజ్ తినే వారికి గుడ్డును మించిన పోషకాల గని ఇంకోటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే ఫుడ్ ఆప్చన్ గుడ్డు మాత్రమే. ఇందులో ప్రొటీన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వండుకుని తినడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్.. ఆఖరికి ఈవినింగ్ స్నాక్‌గా కూడా గుడ్డును తీసుకోవచ్చు. నెల రోజుల పాటు ప్రతీ రోజూ గుడ్డు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటంటే..


కండరాల అభివృద్ధి..

గుడ్లలో ఉండే ప్రొటీన్ కండరాలను రిపేర్ చేయటంతోపాటు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ గుడ్డు తింటే లీన్ మజిల్ మాస్ పెరుగుతుంది. వ్యాయామాలు చేసే వారికి గుడ్లు మంచి ఛాయిస్ అవుతాయి.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

గుడ్లను తగిన మోతాదులో తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్లు గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుడ్లలోని కొలైన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మెదడు, కళ్లు చురుగ్గా మారుతాయి

గుడ్లలో కొలైన్ పుష్కలంగా ఉంటుంది. అది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గుడ్డు పచ్చసోనలో ఉండే లూటైన్, జియాక్సాతిన్ కళ్లను బ్లూ లైట్ డ్యామేజీ నుంచి రక్షిస్తాయి.

బరువు అదుపులో ఉంటుంది

బరువు తగ్గాలనుకున్నా.. అదుపులో ఉంచాలనుకుంటున్నా గుడ్లు మంచి ఛాయిస్ అవుతాయి. గుడ్లలోని హై ప్రొటీన్ కారణంగా అతి ఆకలి ఉండదు. 2009 పరిశోధనల్లో ఏం తేలిందంటే.. ఉదయాన్నే గుడ్లను ఆహారంగా తీసుకునే వారు ఆ రోజంతా తక్కువ క్యాలరీలు తీసుకున్నారు. ఉడక బెట్టిన గుడ్లు తింటే అన్ని రకాలుగా మంచిదట.

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి

గుడ్డులో బయోటిన్, విటమిన్ డీ, అమీనోయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ యూవీ రేస్ కారణంగా పాడైన చర్మాన్ని రిపేర్ చేస్తాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.