Thooti Kura Mokka : చెరువుల్లో, కుంటల్లో, వాగులలో, కాలువల్లో, బావుల్లో అలాగే నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కలల్లో తూటి కూర మొక్క కూడా ఒకటి.
ఈ మొక్క ఆకులతో పప్పును, పచ్చడిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. తూటికూర మొక్క కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తూ ఉంటారు. తూటి కూర మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు ఎటువంటి మందులను మింగే పని లేకుండా కేవలం తూటి కూర మొక్క ఆకులను కూరగా, పప్పుగా, పచ్చడిగా చేసుకుని తినడం వల్ల పుష్కలంగా ఐరన్ లభిస్తుంది.
చాలా మంది గడ్డలు, వ్రణాలు, సెగ గడ్డలు వంటి వాటితో బాధపడులూ ఉంటారు. అలాంటి వారికి తూటి కూర మొక్క ఒక వరమనే చెప్పవచ్చు. తూటి కూర మొక్క ఆకులను ఉపయోగించి గడ్డలను, వ్రణాలను తగ్గించుకోవచ్చు. తూటి కూర మొక్క ఆకులకు ఆముదాన్ని రాసి కొద్దిగా వేడి చేసి గడ్డలపై, వ్రణాలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా రెండు రోజుల పాటు చేయడం వల్ల గడ్డలు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల కళ్ల మంటలు, కంటి చూపు తగ్గడం, కంటి చూపు మందగించడం, కళ్ల నుండి నీరు కారడం వంటి కంటి సమస్యలు తగ్గుతాయి.
Thooti Kura Mokka
అంతే కాకుండా తూటి కూర మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించే గుణం కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క ఆకులను ఏ రూపంగా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి నియంత్రించబడుతుంది. అంతే కాకుండా ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఈ విధంగా అప్పుడప్పుడూ తూటి కూర మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల రోగాలు నయం అవ్వడమే కాకుండా భవిష్యత్తులో రోగాల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.