మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ప్రొటీన్లు అవసరం
మాంసం.. గుడ్లు.. చేపల్లో ఎక్కువగా ప్రొటీన్లు
నాన్ వెజ్ తిననివారు పండ్లలో ప్రొటీన్లు పొందవచ్చు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అవసరం. అంతేకాదు.. మంచి డైట్ కూడా పాటించాలి. శరీరంలో కణాలు.. కండరాలను నిర్మించడంలో ప్రొటీన్లు సహాయపడుతుంది. ప్రొటీన్లు.. దంతాల నుంచి మొదలుపెడితే గోర్లు వరకు అవసరం. ప్రొటీన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతేకాకుండా.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన ఆహారంలో ప్రొటీన్లు అవసరం. అయితే.. మాంసం, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే నాన్ వెజ్ తిననివారి కోసం వారు మాంసాహారం ద్వారా ఏవైతే కోల్పోతున్నారో వాటిని కొన్ని పండ్ల ద్వారా పొందొచ్చు. ప్రొటీన్ లోపంతో బాధపడేవారు ఈ పండ్లను తింటే.. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి.
అవకాడో
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం ఉన్న ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 20 కంటే ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి.. ఇది తింటే శరీరానికి చాలా మంచిది.
దానిమ్మ
పాలీఫెనాల్స్‌తో నిండిన దానిమ్మలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. వీటిలో ఫైబర్.. ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.
జామ
విటమిన్ సి, పొటాషియం.. ఫైబర్ పుష్కలంగా ఉన్న జామ చాలా ప్రోటీన్ కలిగిన పండ్లలో ఒకటి. ఇందులో కొవ్వు.. కేలరీలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ పండు తినడం వల్ల బరువు తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
నేరేడు పండ్లు
ఈ పండ్లలో ప్రోటీన్‌తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి.. బి6 ఉంటాయి. అధిక ఫైబర్, ప్రొటీన్‌తో కూడిన నేరేడు పండు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. ఈ పండులో తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. దీని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు.. బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు ఈ పండు అద్భుతమైన ఎంపిక.
కివి పండు
కివి పండులో అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి. కివాలిన్.. కిస్పర్ అనే ప్రత్యేక ప్రోటీన్లు ఇందులో కనిపిస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.