Thyroid: ఈ కింది లక్షణాలు పురుషుల్లో కనిపిస్తే థైరాయిడ్ సమస్య ఉన్నట్టే.వెంటనే జాగ్రత్త పడండి.

సాధారణంగా మహిళలలో థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. ఇది గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోకపోతే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే ఈ థైరాయిడ్ సమస్య పురుషులలో కూడా కలుగుతుంది అనే విషయం మనలో చాలామందికి తెలియదు.


ఇందుకు ప్రధాన కారణం పురుషుల్లో ఈ థైరాయిడ్ సమస్య లక్షణాలు చాలా స్వల్పంగా కనిపించడమే. ఈ మధ్యకాలంలో మహిళలలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. అయితే ఇది కేవలం మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తుంది అని తెలుసు. పురుషులలో కూడా ఈ సమస్య కలుగుతుందని చాలామందికి తెలియదు. కానీ వైద్య నిపుణులు మాత్రం థైరాయిడ్ సమస్య మహిళలతో పాటు పురుషులలో కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. పురుషులలో ఈ సమస్యను విస్మరించడం వ్యంధత్వానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దీని గురించి బాగా తెలుసుకొని, ఈ లక్షణాలపై శ్రద్ధను తీసుకోవడం చాలా ముఖ్యం. పురుషులలో ఈ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయి, దానిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది. శరీరానికి అవసరమయ్యే దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఇది ఉత్పత్తి చేస్తున్నందున దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు. దీని లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇది ప్రత్యేకంగా కనిపించవు. కొన్ని మహిళలు, పురుషులలో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. పురుషులలో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే అది గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్న పురుషులలో ఎక్కువగా ఆందోళన, చిరాకు, బరువు తగ్గడం, కంటి చికాకు, కండరాల బలహీనత, మతిమరుపు వంటి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ముఖంతోపాటు శరీర భాగాలు కూడా ఉబ్బుతాయి.

అలాగే చెమట తగ్గడం, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలిపోవడం, గొంతు వాచిపోవడం, స్వరమ్ లో మార్పులు వంటి లక్షణాలు పురుషులలో కనిపిస్తాయి. ఇక పురుషుల్లో హైపర్ థైరాయిడిజం ఎక్కువ అయితే బరువు పెరగడం, అధిక రక్తపోటు, బీపీలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంలోని అరచేతులలో జలదరింపు, తిమ్మిరి, గుండె వేగం తగ్గడం, పాదాలలో వాపు, నడుస్తున్నప్పుడు కాళ్లలో సమన్వయం లేకపోవడం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. పురుషుల్లో అకస్మాత్తుగా అధిక జట్టు రాలిపోయిన కూడా జాగ్రత్త వహించాలి. ఈ లక్షణాలు మహిళలలో, పురుషులలో ఒకే రకంగా ఉన్నప్పటికీ పురుషులని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. గ్రేవ్స్ వ్యాధి అని పిలవబడే పరిస్థితి పురుషులలో హైపర్ థైరాయిడిజంనికి కారణం.

శరీరంలో ఈ వ్యాధి ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధి పై పొరపాటున దాడి చేయడం వలన ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని కారణంగా శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే పురుషులు ఎక్కువగా దుష్ప్రభావాలను కలిగించే మందులను తీసుకోకుండా ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. దీన్ని నిరోధించుకోవాలంటే ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవాలంటే లింగ బేధం లేకుండా ఏడాదికి ఒక్కసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.