తిరుమల లడ్డూ వివాదం వేళ చంద్రబాబు పాలనపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడాది జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పాలన వంద రోజులు పూర్తిచేసుకుని ముందుకు సాగుతుంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తాను కృషి చేస్తున్నట్లుగా చెప్పిన చంద్రబాబు ప్రజలను మెప్పించేలా పాలన సాగించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడానికి కృషి చేయాలని భావిస్తున్న చంద్రబాబు ఇప్పటికే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలను తీసుకొని తన మార్కు చూపించారు. ఏపీని ఊహించని విధంగా వరద ముంపుకు గురిచేసిన వర్షాల సమయంలో కూడా చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే ప్రజల మధ్య లోనే ఉంటూ సేవలను అందించారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.

చంద్రబాబు 100 రోజుల పాలనపై సోనూ సూద్ స్పందన

ఒకవైపు తిరుమల లడ్డూ కల్తీ వివాదం వేళ కూడా చంద్రబాబు 100రోజుల పాలనపైన రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక తాజాగా సినీనటుడు గొప్ప మానవతావాది సోనూసూద్ ఏపీలో చంద్రబాబు పాలన పైన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తి అయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన నటుడు సోనూసూద్ చంద్రబాబు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు మంచి విజన్

ఏపీలో చంద్రబాబు మార్కు పాలన కనిపిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 100రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలను సురక్షితంగా, సంతోషంగా ఉంచేందుకు పనిచేసిన తీరును ఆయన ప్రశంసించారు. వందరోజుల పాలన పైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు మంచి విజన్ తో ముందుకు వచ్చారని ఈ విషయంలో గర్వంగా ఉందని సోనుసూద్ వెల్లడించారు.

చంద్రబాబు పాలనకు ప్రముఖుల కితాబు

అలాగే త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని , ఏపీలో పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. సోను సూద్ మాత్రమే కాదు ఏపీలో చాలామంది ప్రముఖులు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, వరదలు సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందన

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి పేదల ఆకలి తీర్చడానికి కృషి చేశారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు రక్షణ కల్పించారని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచారని, ప్రభుత్వ పనితీరును కొందరు మెచ్చుకుంటున్నారు.

వరదల సమయంలోనూ చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు

అలాగే నిరుపేదలకు రేషన్ ద్వారా అందించే నిత్యవసరాలు విషయంలో కూడా చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారని, ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారని, ఇలా వందరోజుల పాలనలో చంద్రబాబు లెక్కకు మిక్కిలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారని చెబుతున్నారు. ముఖ్యంగా వరదల సమయంలో విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు చూపించిన చొరవ ప్రశంసనీయమని అంటున్నారు.