క్లాట్స్ కరిగించి గుండెపోటు రాకుండా.. వీటిని తీసుకోండి, ఇలా చేయండి

మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. అయితే ఈ మధ్య కాలం నుంచి గుండె పోటు ప్రమాదాలు వేగంగదా పెరుగుతున్నాయి. ఇప్పుడు చలికాలం.


ఈ సీజన్‌లో గుండెపోటు ఉన్న వారికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అదే విధంగా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్త నాళాల్లో బ్లాక్స్ లేదా క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవాలి. ఇందుకు గాను పలు ఆహారాలు మనకు ఎంతగానో దోహదం చేస్తాయి.

గుండె పోటు ప్రమాదాలు మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఆరోగ్య కరమైన ఆహారం.. జీవనశైలి గుండె పోటులను నియంత్రిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు వారానికి 200 నిమిషాలు వేగంగా నడవాలి. 200 నిమిషాలు అంటే మీరు ప్రతిరోజూ 40 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవాలి. ప్రతిరోజూ 40 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అదే విధంగా రక్త నాళాల్లో క్లాట్స్ లేదా బ్లాక్స్ ఏర్పడకుండా అవి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గాలన్నా రోజూ గ్రీన్ టీని తాగుతుండాలి. గ్రీన్ టీని రోజుకు 2 లేదా 3 కప్పులు తాగితే ఉపయోగం ఉంటుంది. రక్తంలో ఉండే ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో క్లాట్స్ కరిగిపోతాయి. ఫలితంగా రక్త నాళాల ఆరోగ్యం మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు సుమారుగా 41 శాతం వరకు తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. రక్త నాళాల ఆరోగ్యం కోసం పాలకూర కూడా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్‌, పొటాషియం, ఫోలేట్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను శుభ్రం చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రలో ఉంటాయి. అలాగే పసుపును ఆహారంలో భాగం చేసుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ఇవి రక్త నాళాల వాపులను తగ్గిస్తాయి. రక్త నాళాల్లో ఉండే ప్లేక్‌ను తొలగిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. యాపిల్‌లో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త నాళాల్లో ఉండే ప్లేక్‌ను కరిగిస్తాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. బీట్‌రూట్ రోజూ ఒక కప్పు మోతాదు లో తినాలి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటుంది. ఇలా ఈ ఆహారాలను తీసుకుంటే రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుకుని గుండె పనితీరు మెరుగు పరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.