న్యూ ఇయర్ నాడు ఈ విధంగా చేయడం వలన మీ కలలు నెరవేరుతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త సంవత్సరం వీటిని పాటిస్తే ఏడాది అంతా ఆనందంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరంలో అనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలంటే ఈ 7 గోల్డెన్ టిప్స్ ఫాలో అవ్వండి.
ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం ఏ బాధ లేకుండా సంతోషంగా సాగాలనే కోరిక అందరిలో ఉంటుంది. అలా ఉండాలంటే కొత్త సంవత్సరం (New Year 2026) ఇలా చేయండి. న్యూ ఇయర్ నాడు ఈ విధంగా చేయడం వలన మీ కలలు నెరవేరుతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త సంవత్సరం వీటిని పాటిస్తే ఏడాది అంతా ఆనందంగా ఉండొచ్చు.
కొత్త సంవత్సరంలో అనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలంటే ఈ 7 గోల్డెన్ టిప్స్ ఫాలో అవ్వండి
1.సక్సెస్ అవ్వడానికి మొదటి మంత్రం:
కొత్త సంవత్సరం మొదటి రోజు సక్సెస్ అవ్వడానికి మొదటి మంత్రం త్వరగా నిద్ర లేవడం. త్వరగా నిద్ర లేవడం వలన మీ శరీరం స్వచ్ఛంగా మారుతుంది. మీ మెదడు అవకాశాలను వెతకడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే సనాతన ధర్మంలో సూర్యుని ఆరాధించడం వలన అదృష్టం కలిసి వస్తుంది.
కనుక కొత్త సంవత్సరంలో అన్నీ కలిసి రావాలన్నా, అదృష్టం పెరగాలన్నా సూర్యుడిని ఆరాధించండి. సూర్యుణ్ణి ఆరాధించడం వలన అదృష్టం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది.
2.వినాయకుని ఆరాధించండి:
విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రతి రోజు ఆరాధించాలి. వినాయకుడిని ఆరాధించడం వలన అడ్డంకులు తొలగి పనులు సక్రమంగా పూర్తవుతాయి. అలాగే “శ్రీ గణేశాయ నమః” మంత్రాన్ని పాటించండి. ఈ మంత్రాన్ని జపించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి, సమస్యలు తీరిపోతాయి.
3.ధన్వంతరి మంత్రం:
చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ధన్వంతరి మంత్రాన్ని ఈ రోజు చదువుకుంటే మంచిది. “ఓం నమో భగవతే ధన్వంతరాయ” అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏడాది అంతా సంతోషంగా ఉండడానికి కూడా వీలవుతుంది.
4.ఇంటిని శుభ్రంగా ఉంచండి:
ఏ ఇల్లు అయితే శుభ్రంగా, అందంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు శుభ్రంగా ఉంటే డబ్బు కొరత ఉండదు. ముఖ్యంగా ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రతి రోజు పసుపు నీళ్లు జల్లండి. దాంతో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
5.డబ్బుల విషయంలో ఈ పొరపాట్లు చేయకండి:
చాలా మంది అప్పుల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్లీ మళ్లీ ఏదో ఒక ఆర్థిక సమస్య వస్తూ ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడాలంటే అప్పులను మంగళవారం నాడు చెల్లించండి. కానీ మంగళవారం పొరపాటున కూడా అప్పు తీసుకోవద్దు. ‘రుణమోచన మంగళ స్తోత్రాన్ని’ చదువుకుంటే కూడా త్వరగా అప్పులను తీర్చడానికి వీలవుతుంది.
6.ప్రతికూల శక్తి:
ప్రతికూల శక్తి నుంచి బయటపడడానికి హోమాలు చేయడం మంచిది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి నాడు హోమాలు చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహించడం మొదలుపెడుతుంది.
7.గురువుల అనుగ్రహం:
న్యూ ఇయర్ నాడు పూర్తి సక్సెస్‌ను పొందాలనుకుంటే కచ్చితంగా పెద్దలు, గురువుల ఆశీస్సులను తీసుకోండి. వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయవద్దు. వారికి గౌరవం ఇవ్వాలి. వారి ఆశీస్సులు పొందితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు, ప్రతికూల శక్తికి దూరంగా ఉండొచ్చు, ఆనందంగా జీవించొచ్చు.



































