వంటగ్యాస్ సబ్సిడీ డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే, లేకుంటే రద్దు

వంట గ్యాస్ సబ్సిడీ పొందే వారికి బిత్ అలర్ట్. వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారుల విషయంలో ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేసాయి. కేంద్ర ప్రభుత్వ గ్యాస్​ సబ్సిడీ కోసం డొమెస్టిక్​ ఎల్పీజీ వినియోగదారులు ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయిల్​ కంపెనీలు స్పష్టం చేశాయి.


గ్యాస్​ వినియోగదారులు తమ కంపెనీ మొబైల్​ యాప్​ ద్వారా ఈ-కేవైసీ (బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ) చేయించుకోవచ్చని సూచించారు. చేయని వారికి సబ్సిడీ నిలిచిపోతుందని కంపెనీలు తేల్చి చెప్పాయి.

వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారులు ప్రతీ ఏటా ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ-కేవైసీ మార్చి 31వ తేదీలోపు పూర్తి చేస్తే ఆ సబ్సిడీ తిరిగి చెల్లించనున్నాయి. లేదంటే అది శాశ్వతంగా రద్దవుతుంది. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్​ కంపెనీలు తేల్చి చెప్పాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ-కేవైసీ చేయించడం తప్పనిసరి. ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. అయితే 8, 9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు ముందు ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ ఇస్తోంది. ఒకవేళ ధ్రువీకరణ ఆలస్యమైతే దానిని తాత్కాలికంగా నిలిపివేస్తారు.

ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి చేయించుకునే వెసులుబాటు ఉంది. డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ లో చేయించుకోవచ్చు. కాగా..సబ్సిడీ, ఈ-కేవైసీ ప్రక్రియ లేదా బయోమెట్రిక్​ ధ్రువీకరణ పద్ధతులపై పూర్తి వివరాల కోసం https://www.pmuy.gov.in/e-kyc.html వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ప్రతి సంవత్సరం రాయితీ ఇవ్వాల్సిన వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం సబ్సిడీ కింద రూ.855.22 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసి, ఆ మేరకు నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించారు. ఇప్పటికే పలువురు వినియోగదారులు సమాచారం ఇచ్చినా.. ఇంకా పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో.. మిగిలిన సమయంలోగా అందరూ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

రాయితీ రాకపోవడానికి కారణం ఏంటంటే : ప్రతి నెలా సుమారు రూ.80 కోట్లు జమ చేస్తుండగా, వినియోగదారులకు వెంటవెంటనే రాయితీ డబ్బులు పడేవి. కానీ గత మూడు నెలలుగా ఈ నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెలా జమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ మాత్రం కొందరి ఖాతాల్లో మాత్రమే జమవుతున్నాయి. కారణం ఏంటనేది తెలియడం లేదు. వంటగ్యాస్‌ కార్యాలయాలకు వెళ్తే బ్యాంకులకు వెళ్లమని, బ్యాంకులకు వెళ్తే వంటగ్యాస్‌ కార్యాలయాలకు వెళ్లాలని సూచిస్తుండటంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. అసలు కారణం ఏంటంటే కేవలం గ్యాస్​ సబ్సిడీ కోసం ఈ-కేవైసీ చేయించిన వారి ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వ రాయితీ పడుతుంది. మిగతా వారికి సబ్సిడీ రావడం లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.