మన మెదడు ఆరోగ్యం మన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి. ఒత్తిడి, అలసట తగ్గి మెదడు చురుకుగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడి.. దీర్ఘకాలంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. మనం తినేది మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం మెదడును చురుకుగా ఉంచుతుంది. మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన మెదడుకు ఆరోగ్యకరమైన శరీరం అవసరం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడులో వాపు తగ్గుతుంది. ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మెదడులో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్లైన సెరోటోనిన్, డోపమైన్‌లను బ్యాలెన్స్‌గా ఉంచడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, జింక్, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు అవసరం.
మెదడుకు మేలు చేసే ఆహారాలు
- కొవ్వు చేపలు.. సార్డిన్స్, సాల్మన్, మాకెరెల్ వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
- ఆకుకూరలు.. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి.
- గుడ్లు.. ఇవి మెదడుకు హాని జరగకుండా రక్షణ కల్పిస్తాయి.
- డ్రై ఫ్రూట్స్.. వాల్‌నట్స్, బాదం, చియా, అవిసె, గుమ్మడికాయ గింజలలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.
- బెర్రీలు, అవకాడో.. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
- ధాన్యాలు.. బ్రౌన్ రైస్, గోధుమ, ఓట్స్ వంటివి మెదడుకు శక్తిని అందిస్తాయి.
- డార్క్ చాక్లెట్.. ఇందులో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
- సుగంధ ద్రవ్యాలు.. పసుపు, లవంగాలు, అలాగే పండ్లు, కూరగాయలు మెదడుకు మంచివి.
- ప్రోబయోటిక్స్.. పెరుగు, మజ్జిగ వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నీరు కూడా ముఖ్యం
మంచి ఆహారంతో పాటు.. ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం కూడా మెదడుకు చాలా అవసరం. మెదడులో 75 శాతం నీరు ఉంటుంది. తగినంత నీరు తాగకపోతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పుదీనా షర్బత్ వంటి డ్రింక్స్ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. అలాగే పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీరు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడం మంచిది. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































