వైరల్ ఫీవర్స్ ఎటాక్ చేయొద్దంటే.. ఇలా చేయండి

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువై పోయాయి. అందులోనూ ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కూడా అస్సలు బాలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారు.

ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటివి ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వైరల్ ఫీవర్స్ ఎటాక్ చేయకుండా ఉండాలంటే.. ముందుగా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలి. వ్యాధులతో పోరాడే శక్తి ఉండాలి. అప్పుడే మీకు వైరల్ ఫీవర్స్ అనేవి త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

వైరల్ ఫీవర్స్ అనేవి అ శుభ్రంగా ఉండటం వల్లనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ సారీ కాళ్లు, చేతులు, ముఖం కడుగుతూ ఉండాలి. దగ్గడం, తుమ్మిన ప్రతీ సారి చేతుల్ని కడుగుతూ ఉండాలి. ఇంట్లో కూడా చెత్త, చెదారాలు లేకుండా చూసుకోండి.

సమస్య వచ్చిన తర్వాత కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. ముందుగానే వైద్యుల్ని సంప్రదించి.. వ్యాక్సిన్ వంటివి తీసుకోండి. మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవాలి.

ఇంట్లో ఒక్కరికి జ్వరం వచ్చినా.. ఎదుటి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండటం మంచిది. వారి బట్టలు, వస్తువులు వాడక పోవడమే మంచిది. అలాగే ఇంట్లోకి దోమలు రాకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిని తాగాలి.