కాఫీ అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. కొందరు రోజుకు ఒకసారి తాగుతారు, మరికొందరు రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా కాఫీ తాగకుండా ఉండలేరు.
అయితే తాజాగా వైద్య నిపుణులు కాఫీపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో శోషించడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. కాఫీ తాగితే చురుకుదనం పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఇలా చేయడం ఉత్తమం..
మధ్యాహ్నం సమయంలో కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత చాలా మందికి నిద్ర మత్తు ఎక్కువగా వస్తుంది. ఆ సమయంలో ఒక కప్పు కాఫీ తాగితే అలసట తగ్గిపోతుంది. అయితే కాఫీని ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లతో కలపరాదు. ఇలా చేస్తే శరీరంలో ఆమ్లత్వం పెరిగి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎర్ర మాంసం తిన్న తర్వాత కాఫీ తాగడం తప్పించుకోవాలి. ఎందుకంటే ఇది మాంసం జీర్ణాన్ని ఆలస్యం చేస్తుంది. అలాగే ఐరన్ శోషణను కూడా అడ్డుకుంటుంది.
కాఫీ తాగడం వలన మనసు ఫ్రెష్‌గా మారుతుంది. మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు ఒక చిన్న కప్పు కాఫీ తాగినా ఉత్సాహం పెరుగుతుంది. అందుకే చాలా మంది దీన్ని సహజమైన మూడ్ సెట్ చేసే డ్రింక్‌గా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి అపారమైన ప్రాచుర్యం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు పాలు, చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని సూచిస్తున్నారు. ఇది మరింత ఆరోగ్యకరమని చెబుతున్నారు. మొత్తానికి, కాఫీని సరైన సమయంలో, సరైన విధంగా తాగితే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
































