ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకించి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు.
శ్రావణ మాసంలో గుమ్మానికి తోరణాలు కట్టాలి. దీప, ధూప నైవేద్యాలతో ఇల్లు కళకళ్ళాడాలి.
శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. అయితే ఈ రోజు రెండవ శుక్రవారం. లక్ష్మీదేవికి పూజ చేసి ఏ నైవేద్యం పెట్టాలి? లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఏవో ఈరోజు తెలుసుకుందాం.
శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి వీటిని నైవేద్యంగా పెడితే మంచిది:
1.బెల్లంతో చేసిన పరమాన్నం
లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి దీనిని నివేదన చేస్తే మంచి జరుగుతుంది. బెల్లం నైవేద్యంగా పెడితే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకే నిత్య పూజలో కూడా బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు.
2.తెల్లని కొబ్బరి అన్నం
లక్ష్మీదేవికి తెల్లని కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడితే కూడా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవికి తెల్లటి కొబ్బరి అన్నం అంటే ఎంతో ప్రీతి.
3.పాయసం
బియ్యంతో వండిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే విశేష ఫలితాలను పొందవచ్చు. కనుక రెండవ శుక్రవారం నాడు పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు.
4.దద్దోజనంతో పాటు ఇవి కూడా
లక్ష్మీదేవికి దద్దోజనాన్ని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. అదే విధంగా లక్ష్మీదేవికి పాకం గారెలు, పెసరపప్పు పాయసం, వడపప్పు, పులిహోర, కదంబం నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పూజ చేసి చివరగా లక్ష్మీదేవికి వీటిని నివేదన చేస్తే, లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. సంతోషంగా ఉండొచ్చు.
తులసి పూజ:
- శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణ మాసంలో తులసి కోట దగ్గర ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. దీపారాధన చేయాలి.
- తులసి కోటను శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి.
- శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక గుర్తులు కూడా ముగ్గు పిండితో వేయాలి. అష్టదళ పద్మం పెట్టాలి.
- మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి తొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన చేయాలి.
- తులసికి గులాబీలు, తెల్లటి పూలు సమర్పించి 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి.
- 21 సార్లు “ఓం బృందావన్యై నమః” అనే మంత్రాన్ని జపిస్తే మంచిది.
- అరటిపండు, దానిమ్మ గింజలు తులసి మాతకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.































