నేటి తెలుగు పంచాంగం ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. ! నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా…(14/04/24)

today telugu panchangam today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏప్రిల్(April) 14వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం…


మిధునంలో చంద్రుడి సంచారం..
రాష్ట్రీయ మితి ఛైత్ర 25, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 04, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 14 ఏప్రిల్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం సాయంత్రం 4:55 గంటల నుంచి సాయంత్రం 6: 28 గంటల వరకు. ఈరోజు షష్టి తిథి ఉదయం 11:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:34 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశిలో సంచారం చేయనున్నాడు.
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:27 గంటల నుంచి ఉదయం 5:15 గంటల వరకు
అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:41 గంటల వరకు
అమృత కాలం : మధ్యాహ్నం 3:15 గంటల నుంచి సాయంత్రం 4:54 గంటల వరకు
సూర్యోదయం సమయం 14 ఏప్రిల్ 2024 : ఉదయం 6:04 గంటలకు
సూర్యాస్తమయం సమయం 14 ఏప్రిల్ 2024: సాయంత్రం 6:28 గంటలకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : సాయంత్రం 4:55 గంటల నుంచి సాయంత్రం 6: 28 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:22 గంటల నుంచి సాయంత్రం 4:55 గంటల వరకు
యమ గండం : మధ్యాహ్నం 12:16 గంటల నుంచి మధ్యాహ్నం 1:49 గంటల వరకు
దుర్ముహుర్తం : సాయంత్రం 4:49 గంటల నుంచి సాయంత్రం 5:38 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా…(14/04/24)

మేషం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.

వృషభం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.

మిథునం
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం
మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మనసుకు ఒత్తిడిని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు వస్తాయి.

సింహం
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

కన్య
మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

తుల
శత్రువుల మీద విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు బాధతో పాటు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజసౌఖ్యం కలదు. చేయని తప్పునకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలు ఉన్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.

మకరం
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి ఆటంకం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

కుంభం
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీసుబ్రహ్మణ్య ధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

మీనం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.