Somvati Amavasya 2024: రేపే సంవత్సరం చివరి అమావాస్య.. ప్రాముఖ్యత ఇదే!

www.mannamweb.com


Somvati Amavasya 2024: ప్రతి నెలా అమావాస్య తిథి (Somvati Amavasya 2024) వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి, విష్ణువు, పూర్వీకులను స్మరించుకుంటారు.

2024 చివరి అమావాస్యను మార్గశీర్ష అమావాస్య, ఎల్ల అమావాస్య లేదా సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య తర్వాత మార్గశీర్ష మాసం ముగిసి పుష్య మాసం ప్రారంభమవుతుంది. 2024 చివరి అమావాస్య సోమవారం కాబట్టి.. ఈ రోజున విష్ణువుతో పాటు శివుడిని కూడా పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున పూజించడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. చివరి అమావాస్య లేదా సోమవతి అమావాస్య 2024 గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

సోమవతి అమావాస్య 2024 శుభప్రదం

2024 సోమవతి అమావాస్య తిథి: సోమవారం, డిసెంబర్ 30, 2024. అమావాస్య తిథి ప్రారంభం: సోమవారం, డిసెంబర్ 30, 2024 ఉదయం 4:01 గంటలకు . అమావాస్య తిథి ముగింపు: మంగళవారం, డిసెంబర్ 31, 2024 ఉదయం 3:56 గంటలకు.

సోమవతి అమావాస్య పూజా విధానం

సోమవతి అమావాస్య రోజు ఉదయం పవిత్ర నదిలో స్నానం చేయాలి.
స్నానం తర్వాత మీ పూర్వీకుల పేరిట నెయ్యి దీపం వెలిగించండి.
ఈ రోజున బ్రాహ్మణులకు ఆహారం ఏర్పాటు చేయండి లేదా మీకు చేతనైనంత దానం చేయండి.
సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం చేయాలి.
ఈ రోజున తులసి మొక్కను పూజించి తులసి మంత్రాన్ని జపించాలి.
సోమవతి అమావాస్య రోజున విష్ణువు, శివుని పూజించాలి.
సోమవతి అమావాస్య మంత్రం

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ
ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్
ఓం హ్రీం కార్తవీర్యాఅర్జునో నాం రాజా బహు సహస్త్రవాన్
ఓం నమః శివాయ
ఓం ఆపదమ్పహార్థరం దాతారం సర్వసంపదం లోకాభిరామన్
శ్రీ రామ్ భూయో-భూయో నమామ్యహం
ఓం కుల్ దేవతాభ్యో నమః

సోమవతి అమావాస్య పూజ ప్రయోజనాలు

సోమవతి అమావాస్యను జరుపుకోవడం ద్వారా మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది మీకు విజయం, ఆనందం, సంపదను తెస్తుంది.
సోమవతి అమావాస్య ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక అభివృద్ధికి జరుపుకుంటారు. భక్తుల ప్రకారం.. సోమవతి అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల వారి కర్మల నుండి విముక్తి లభిస్తుంది. పూర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది.

సోమవతి అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి?

సోమవతి అమావాస్యకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి సోమవారం వస్తుంది. కాబట్టి దానిని సోమవతి అమావాస్య అంటారు. పూర్వీకులను ఆరాధించడానికి ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను గౌరవించడం ద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది. మన పూర్వీకులను సంతృప్తి పరచడం ద్వారా మనకు మంచి సంతానం, సంపద, ఆనందం లభిస్తాయి. ఈ రోజు ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా ముఖ్యమైన రోజు. సోమవతి అమావాస్య పితృ దోషాన్ని తొలగించడానికి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రజలు గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి ఇష్టపడతారు.