ఉదయం నిద్రలేవగానే ప్రతీ ఒక్కరం చేసే పని బ్రష్ చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందుకే కేవలం ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా బ్రషింగ్ చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. నోటి ఆరోగ్యం, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బ్రషింగ్ చేసుకోవాల్సిందే.
అయితే బ్రషింగ్ విషయంలో మనలో కొందరు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటిలో ప్రధానమైంది టూత్ పేస్ట్. సాధారణంగా ఎక్కువ టూత్ పేస్ట్ వాడితే మంచిదని మనలో చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ టూత్ పేస్ట్ ఎక్కువగా వాడడం మంచిదేనా.? అసలు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంత టూత్ పేస్ట్‌ను వాడాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టూత్‌పేస్ట్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల లాభం ఉండకపోగా నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బఠానీ గింజ పరిమాణం ఉంటే చాలని చెబుతున్నారు. ఇది మొత్తం దంతాలను శుభ్రం చేసుకోవడాఇనకి సరిపోతుంది. అయితే టూత్ పేస్ట్‌ను ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
సాధారణంగా టూత్ పేస్టుల్లో సోడియం ఫ్లోరైడ్‌ను ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే సోడియం ఫ్లోరైడ్ కారణంగా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో దంతాల్లో కావిటీస్ ఏర్పడి ఫ్లోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొత్త మొత్తంలోనే టూత్ పేస్ట్‌ను ఉపయోగించాలి. ఇక నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మౌత్ ఫ్రెషనర్స్‌న ఉపయోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా తగ్గాలంటే మౌత్ ఫ్రెషనర్స్ బాగా ఉపయోగపడతాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.