టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ ధరకే లభిస్తాయి. నీరు, శక్తి సామర్థ్యంతో శుభ్రం చేస్తాయి. అంతేకాకుండా అవి ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటాయి.
మెషిన్ పనిచేస్తున్నప్పుడు కూడా మధ్యలో బట్టలు వేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. తక్కువ ఖర్చు కావాలంటే టాప్ లోడ్ మెషిన్లు బెస్ట్ ఆప్షన్.
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు మెరుగ్గా శుభ్రపరచడం, అధిక సామర్థ్యం కోసం తయారుచేశారు. మీరు మరకలను సమర్థవంతంగా తొలగించాలని అనుకుంటే వీటిని ఎంచుకోవచ్చు. ఇది టంబుల్-లోడ్ చర్యను ఉపయోగిస్తుంది. బట్టలను సున్నితంగా ఉతుకుతుంది. తక్కువ నీరు, విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఈ సామర్థ్యం మీ విద్యుత్ బిల్లులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఫ్రంట్ లోడ్ మెషిన్లలో బట్టల నుండి ఎక్కువ నీటిని తీయడం వలన అవి త్వరగా ఆరిపోతాయి. ముఖ్యంగా ఇవి చాలా సైలెంట్‌గా పనిచేస్తాయి. అయితే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు కొంచెం ఖరీదైనవి. టాప్ లోడ్ మెషీన్ల కంటే ఉతికే సమయం ఎక్కువ పడుతుంది. లోపల తేమ ఉంటే బూజు పెరిగే అవకాశం ఉన్నందున, వాడిన తర్వాత తలుపు తెరిచి ఉంచడం అవసరం.
టాప్ లోడ్ మెషీన్ల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అవి బట్టలపై కాస్త కఠినంగా ఉంటాయి. ఫ్రంట్ లోడ్ మెషీన్లతో పోలిస్తే ఇది ఎక్కువ నీరు, శక్తిని ఉపయోగిస్తుంది. ఉతికిన తర్వాత బట్టలు ఎక్కువ తేమతో బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది.
మీరు మెరుగైన శుభ్రత, విద్యుత్ సామర్థ్యం కావాలంటే ఫ్రంట్ లోడ్ మెషిన్‌ను.. లేదా తక్కువ ధర, ఈజీ పని కావాలంటే టాప్ లోడ్ మెషిన్‌ను ఎంచుకోవచ్చు. మీ సౌలభ్యం, బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
































