శుభవార్త.. బంగారంపై ఏకంగా రూ.30 వేలు తగ్గింపు

బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు 22 క్యారెట్ల బంగారం ధర పలుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


మొన్నటి వరకు లక్షలోపే బంగారం ధరలు నమోదు అయ్యాయి కానీ ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం రూ.1,02,000కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1.10 లక్షలు పలుకుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఆల్ టైం రికార్డ్ స్థాయి అని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పటివరకు ఈ రేంజ్ లో ధర పలకడం ఇదే తొలిసారి కూడా.. ఇలాంటి సమయంలో సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న ఒక వార్త సామాన్యులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఇలా గనుక జరిగితే.. బంగారం ధరలపై దాదాపు 25 నుంచి 30 వేల వరకు ధరలు తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే బంగారం ధరలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో జాతీయ , అంతర్జాతీయ కారణాలు కూడా దోహదం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ కారణాలే ప్రధానం అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే విదేశాల నుండి బంగారం దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో సుంకాల భారం బంగారం పెరుగుదలకు ప్రధానంగా నిలుస్తోంది. దీనికి తోడు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంచడంతో బంగారం ధరలలో కూడా ఊహించని మార్పులు వచ్చాయి. దీంతో ఇండియాలో కూడా బంగారం ధరలు బాగా పెరిగిపోయి.. సామాన్యుడికి పెనుబారంగా మారాయి. అందుకే ఇప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ మధ్యకాలంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నట్లు వార్తలు రాగా.. ఒకవేళ ఇదే జరిగితే డాలర్ విలువ బలపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తొలగించి.. డాలర్ వైపు మల్లిస్తారు. తద్వారా బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి తోడు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే.. మార్కెట్లో భయాందోళనలు పోయి.. ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టబడులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు చైనా ప్రస్తుతం పెద్ద ఎత్తున బంగారు నిల్వలని పెంచుకుంటూ పోతోంది. చైనా గనుక బంగారం నిల్వలను పెంచే ప్రక్రియను కాస్త ఆపితే గనుక బంగారం మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.అంతేకాదు రూపాయి విలువ నిలదొక్కుకున్నట్లయితే బంగారం విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పైగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతుల పైన సుంకాలు తగ్గించినట్లయితే బంగారం ధరలు కూడా తగ్గుతాయి.

ఇకపోతే బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ 3600 డాలర్ల వద్ద ఉంది. ఇది ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఒకవేళ ఈ స్థాయి నుంచి బంగారం ధర 3200 డాలర్ల తగ్గినట్లయితే.. బంగారం ధర 10 గ్రాములకు 85 వేలకు దిగివచ్చే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. మొత్తానికి అయితే ఇవన్నీ జరిగితే బంగారం తగ్గుతుందని అటు నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయో.. బంగారం ధరలు ఎప్పుడు భూమి వైపు చూస్తాయో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.