స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు – ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. కాపలా లేని రైల్వే గేటును దాటడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.


ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.