భారత రైల్వే లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణాలు చేయాడానికి ఇష్టపడతారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మెరుగైన సదుపాయాలు అందిస్తుంది. అంతేకాదు ఇతర ప్రైవేట్ వాహనాలతో పోల్చితే టికెట్ ధర కూడా తక్కువ ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ప్రతిరోజూ లక్షల సంఖ్యలో రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఇటీవల రైల్వే ప్రయాణికులకు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తుంది. ఒక్క టికెట్ తో ఆరు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు జర్నీ చేసే అవకాశం..దీని ధర ఎంతో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్. మన దేశంలో ఒక్క టికెట్ తో 4 రోజులు, 6 రాష్ట్రాలు, 16 నదులను చూసే అవకాశం కల్పించబడింది. సాధారణంగా మనలో చాలా మందికి లాంగ్ జర్నీ చేయాలని ఆలోచన ఉంటుంది. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణ ఖర్చులు భరించడం కష్టం. అందుకే సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తక్కవ ఖర్చుతో సుదూర ప్రయాణం.. ఎన్నో ప్రకృతి అందాలు, నగరాలు, నదులు చూసే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హ్యాపీగా జర్నీ చేయొచ్చే లేదా సోలోగా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్ జర్నీ చేయానుకునే వారికి రైలు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గం అనే చెప్పొచ్చు. ఒక్క టికెట్ తో 4 రోజులు, 6 రాష్ట్రాలు, 16 నదులు, 76కు పైగా నగరాలు చుట్టేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది. ఈ అవకాశం రైల్వే కల్పించబడింది. మరి ఆ రైలు ఏది? ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివేక్ ఎక్స్ ప్రెస్ డిబ్రుగర్హ(అస్సాం) నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది. ప్రతిరోజూ రాత్రి 7:55 గంటలకు డిబ్రూగర్హ లో ప్రారంభమవుతుంది.. 74 గంటల ప్రయాణం తర్వాత కన్యాకుమారికి రాత్రి 9:55 గంటలకు చేరుకుంటుంది. ఈ జర్నీలో మొత్తం 59 స్టేషన్లు కవర్ చేస్తుంది. భారత్ లో అత్యంత పొడవైన రైలుగా ప్రత్యేకత ఉన్న ఈ రైలు ప్రపంచంలోనే 24వ లాంగెస్ట్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ ట్రైన్ ని 19 నవంబర్, 2011 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.ప్రస్తుతం డైలీ సర్వీసుగా కొనసాగుతుంది. ఇక టికెట్ ధర విషయానికి వస్తే.. స్లీపర్ ధర రూ.1200 లోపే, థర్డ్ ఏసీ రూ.3015, సెకండ్ ఏసీ రూ.4,450 వరకు ఉంటుంది. ఇది గోదావరి, క్రిష్టా, పెన్నా వంటి ప్రధాన నదుల గుండా ప్రయాణిస్తుంది.ఈ ట్రైన్ లో మూడు పూటలా భోజన వసతి, స్నాక్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ ప్రయాణం చేసే సమయంలో ఎన్నో అందాలను తమ కెమెరాలో బంధిస్తుంటారు ప్రయాణికులు. మరి మీరు ఈ జర్నీ చేయాలని అనుకుంటే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి.