పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. తాము ఆదాయం పొందుతూనే మరో నలుగురికి ఉపాధి కల్పించాలని ఆశిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యంలో చాలా మంది వ్యాపారం మొదలు పెట్టాలనే ఆసక్తి ఉన్నా..
వెనుకడుగు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలాంటి కాంపిటేషన్ లేని ఒక క్రేజీ బిజినెష్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో బీఎస్6 వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాహనాల్లో డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (DEF)ను ఉపయోగించాల్సి ఉంటుంది. పొల్యుషన్‌ను తగ్గించేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఆటో మొబైల్ షాప్స్‌లో ఈ డీఈఎఫ్‌లు 10 లీటర్ల బాటిల్స్ చొప్పున అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా పొల్యుషన్ తగ్గడంతో పాటు ఇంజన్‌ను కాపాడుతాయి. ఈ డీఈఎఫ్‌ను తయారు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
ఈ ఫ్లూయిడ్‌ను తయారు చేయడానికి నీటితో పాటు, టెక్నికల్ గ్రేడ్ యూరియా అవసరపడుతుంది. ఇక ఆర్‌ఓ మిషిన్ అవసరం ఉంటుంది. ఆర్‌ఓ మిషన్ ద్వారా తయారు చేసిన నీటిని.. డీఎమ్ ప్లాంట్ అనే మిషిన్‌లో పోయాలి. వెంటనే డీఎమ్ వాటర్ బయటకు వస్తాయి. ఇక చివరిగా ఈ డీఎమ్ నీటిని డీఈఎఫ్ మిషిన్‌లో వేసి.. టెక్నికల్ గ్రేడ్ యూరియాను వేసి కలపాలి. ఒక గంటపాటు ప్రాసెస్ జరిగిన తర్వాత డీఈఎఫ్ బయటకు వస్తుంది. వీటిని క్యాన్స్‌లో నింపి ఆటో మొబైల్ దుకాణాలకు అందించవచ్చు.
ఒక లీటర్ డీఈఎఫ్ లిక్విడ్ తయారు చేయడానికి దాదాపు రూ. 20 ఖర్చవుతుంది. లీటర్ లిక్విడ్‌ను హోల్‌సేల్‌గా రూ. 40 వరకు విక్రయించవచ్చు. అంటే ఒక్క లీటర్ లిక్విడ్‌కు సుమారు రూ. 10 లాభం వస్తుంది. రోజుకు వెయ్యి లీటర్ల లిక్విడ్‌ను తయారు చేసినా తక్కువలో తక్కువ రోజుకు రూ. 10వేలు సంపాదించవచ్చు. దీంతో ఎంత కాదన్న నెలకు లక్షల్లో ఆదాయం ఏటూపోదు. పెట్టుబడి విషయానికొస్తే మొత్తం సెటప్‌కు.. సుమారు రూ. 7 లక్షల పెట్టుబడి అవసరపడుతుంది.