ఇవాళ నవంబర్ 21 నుండి 24 వరకు జరగననున్న నేత్ర మంతెన పెళ్లితో ఇప్పుడు ప్రపంచం దృష్టి రాజస్థాన్లోని ఉదయపూర్ మీద పడింది. ఇంతకీ ఎవరీ నేత్ర అనుకుంటున్నారా..
ఆమె ఎవరో కాదు.. అమెరికన్ బిలియనీర్ రామరాజు మంతెన కుమార్తె. ఆమె టెక్ ఇన్నోవేటర్ వంశీ గాదిరాజును పెళ్లి చేసుకుంటున్నారు.
ఈ పెళ్లికి ట్రంప్ తనయుడితోపాటు, ఇంటర్నేషనల్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ వంటి అనేక మంది బాలీవుడ్ తారలు కూడా ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవుతున్నారు. నేత్ర మంతెన తన ప్రొఫైల్ ను చాలా ప్రైవేట్ గా ఉంచుతారు. ఆమె తండ్రి మంతెన రామరాజు అమెరికా కు చెందిన బిలియనీర్. ఆంధ్రప్రదేశ్ కు మూలాలున్న కుటుంబం వీరిది.
మంతెన రామరాజు అమెరికాకు చెందిన ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ (Ingenus Pharmaceuticals ) చైర్మన్, ఇంకా CEO. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ICORE Healthcare , OncoScripts వంటి గ్లోబల్ హెల్త్ కేర్ వెంచర్లకు యజమాని కూడా. యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్, భారతదేశం అంతటా విస్తరించి ఉన్న వ్యాపారాలతో, మంతెన రామరాజు ప్రపంచ ఫార్మా రంగంలో ఒక లెజెండ్.
ఇక, వరుడి వివరాలికొస్తే, పేరు వంశీ గాదిరాజు. ఇతను టెక్కీ. సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. కొలంబియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు. ఇతని కంపెనీ ప్రఖ్యాత సూపర్ ఆర్డర్ అనే యాప్ ను రూపొందించింది. 2024లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో (Food & Drink category) చోటు సంపాదించాడు. ప్రస్తుతం సూపర్ ఆర్డర్ విలువ $18-25 మిలియన్ల మధ్య ఉండొచ్చని అంచనా.
వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్న ఈ పెళ్లి.. పిచోలా సరస్సుపై రాజ వైభవానికి ప్రతీకైన జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లలో జరగుతోంది. చారిత్రాత్మక సిటీ ప్యాలెస్‌లోని లీలా ప్యాలెస్ మానెక్ చౌక్, జెనానా మహల్ లలో ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి.
































