టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇవాళ్టి నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని.. రాజకీయ నేతలు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.