ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ కూడా పంచాంగం చూసుకుంటారు. ఆదాయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి?
ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం.
మేష రాశి
ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5 మరియు అవమానం 7. శ్రీ విశ్వావసు సంవత్సరంలో మేష రాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. బృహస్పతి తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండటం చేత వీరికి ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేదు. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉన్నది. వీరు అప్పులు చేయకూడదు. ఏలినాటి వల్ల సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతున్నాయి.
వృషభ రాశి
ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 7. వృషభరాశి వారికి శ్రీవిశ్వావసు సంవత్సరంలో శని లాభ స్థానంలో అనుకూలంగా ఉండటం, బృహస్పతి ధన స్థానంలో అనుకూలంగా ఉండటం చేత ఆర్థికపరంగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆర్థికపరంగా ప్రయోజనం పొందుతారు. పెట్టుబడులు కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గాంటారు. ధనలాభం, సంతోషం. వీరికి ఆర్థిక పరంగా అనుకూలమైన సంవత్సరం.
మిథున రాశి
ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, వ్యయం 3. జన్మరాశిలో బృహస్పతి సంచారం చేత ఆర్థికపరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడుల కోసం డబ్బులను సమకూర్చుకుంటారు. ఆర్థిక పరంగా పురోగతి ఉన్నప్పటికీ ఒత్తిళ్లు ఎదురవుతాయి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. బీపీ, హార్ట్ సమస్యలతో ఇబ్బందిపడే సూచనలున్నాయి.
కర్కాటక రాశి
ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కొంత ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం కనపడుతుంది. కర్కాటక రాశి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆరోగ్య నిమిత్తం ధనము, వ్యయము అగు సూచనలు కనిపించుచున్నాయి. కర్కాటక రాశి వారు ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా శుభఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించండి. నవగ్రహ పీడా స్త్రోత్రం పఠించడం చేత శుభ ఫలితాలు పొందగలరు.
సింహ రాశి
ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 7 అవమానం 3. లాభ స్థానంలో గురుడి అనుకూల సంచారం. జన్మరాశిలో కేతువు సంచారం చేత ఆర్థిక పరంగా మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆదాయాన్ని పెంచుకుంటరు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్ల వంటివి కలిసివస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి.
కన్యా రాశి
ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. ఈ ఏడాది శని కలత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం, గురుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక పరంగా కన్యా రాశికి బాగుంటుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వ్యాపారస్తులు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రిస్తారు.
తులా రాశి
ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 2, తులారాశి వారికి ఈ ఏడాదిలో శని ఆరవ స్థానంలో అనుకూలంగా, గురుడు భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఆర్థికంగా అద్భుతమైన సంవత్సరం . ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన గృహాలు వంటివి అనుకూలిస్థాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో తులా రాశి వ్యాపారస్తులకు లాభదాయకం, ఉద్యోగస్థులకు ధన లాభం, స్త్రీలకు ఆరోగ్యం, సౌఖ్యం కలుగును.
వృశ్చిక రాశి
ఈ ఏడాది రాజపూజ్యం 5 అవమానం 2, ఆదాయం 2 వ్యయం 14. అష్టమ గురుడి సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటాయి. ధన లాభం ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఖర్చులు ఉండును. మీరు సంపాదినటువంటి ధనాన్ని అప్పులు, లోన్లు వంటివి తీర్చడానికి వినియోగించెదరు. గృహాలు, బంగారం వంటి వాటిలో ఇన్వెస్టమెంట్లు చేస్తారు.
ధనస్సు రాశి
ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తెలియనివారికి ధన సహాయం వంటివి చేయడం, అప్పు ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్థులకు ఆర్థికపరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. రావాల్సిన ధనం చేతికి రావడంలో ఆలస్యం కలుగును. ఆరోగ్యపరంగా అనుకూలంగా లేదు. అర్ధమాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యం అనుకూలించదు. ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఈ సంవత్సరం కొంత ఇబ్బంది ఉంటుంది.
మకర రాశి
ఈ ఏడాది రాజపూజ్యం 4, అవమానం 5, ఆదాయం 8, వ్యయం 14,. మకరరాశి వారికి శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే బృహస్పతి శత్రు స్థానంలో ప్రతికూలంగా సంచరించడం, వాక్ స్థానంలో రాహువు, ఆయు స్థానంలో కేతు ప్రభావం చేత మకర రాశి వారికి ఆర్థికపరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలగనున్నాయి. నూతన పెట్టుబడుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్థులకు మధ్యస్థ సమయం. మకర రాశికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి.
కుంభ రాశి
ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దని సూచన. ఉద్యోగస్థులకు ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. కుంభరాశి వారికి శ్రీవిశ్వావసు సంవత్సరంలో ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. జన్మ రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిళ్లు, సమస్యలు వేధించును.
మీన రాశి
ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ధన సంపాదన ఉన్నప్పటికీ మీ సంపాదనను కుటుంబం కోసం, మీ యొక్క అవసరాల కోసం ఖర్చు చేసేదెరు. ఖర్చులు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. తెలియని పెట్టుబడులకి, అప్పులు ఇచ్చే వ్యవహారాలు వంటి వాటిలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్థులకు ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. ఉద్యోగస్థులకు ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. మీనరాశి వారికి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది ఉంటాయి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది