ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ.. నిద్రావస్థలో ఉన్నత విద్యా మండలి

www.mannamweb.com


దేశవ్యాప్తంగా భారీగా నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. మొత్తం 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లు యూజీసీ తన ప్రకటనలో వెల్లడించింది. వాటిలో ఏపీకి సంబంధించి రెండు యూనివర్సిటీలు ఉన్నట్లు గుర్తించింది. గుంటూరులోని కాకుమానివారితోటలోని క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇండియా.. ఈ రెండు యూనివర్సిటీలను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది. ఇలాంటి నకిలీ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని, ఈ విద్యా సంస్థలు ఇచ్చిన ధ్రువపత్రాలు చెల్లుబాటు కావని యూజీసీ పేర్కొంది. మరోవైపు యేటా యూజీసీ నకిలీ యూనివర్సిటీలను ప్రకటిస్తున్నా, ఉన్నత విద్యాశాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. కనీసం వాటి యజమానులను పిలిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో తమిళనాడు, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొన్ని యూవర్సిటీల పేర్లతో యధేచ్చగా కోర్సులు నిర్వహిస్తున్నారు. వన్‌ సిట్టింగ్‌లోనే డిగ్రీ సర్టిపికెట్లు ఇస్తామంటూ అమాయక ప్రజాలను బురిడీ కొట్టిస్తున్నారు. అయితే అవి నకిలీ యూనివర్సిటీలని తెలియని చాలామంది విద్యార్థులు వాటిల్లో ప్రవేశాలు పొందుతున్నారు. తీరా డబ్బు, సమయం వెచ్చించి చదివిన తర్వాత ఆ ధ్రువపత్రాలు చెల్లవని చెబుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి నకిలీ విశ్వవిద్యాలయాలపై దృష్టి పెట్టాలని, వాటిని ప్రక్షాలన చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశు వైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. తాజా ప్రకటనతో దరఖాస్తు గడువును ఆగస్టు 29 వరకు పొడిగించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తిమేరకు బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో దరఖాస్తు చేసుకునే తేదీని పెంచినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ పి రఘురామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడత కింద జులై 12 నుంచి ఆగస్టు 17 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అవకాశం ఇచ్చారు. తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆగస్టు 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి మరోమారు అవకాశం ఇచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్‌ సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించాలని కోరారు.